CHAKRA THEERTHAM IN FULL SWING _ తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి

PUJAS PERFORMED ON THE OCCASION OF MUKKOTI

Tirumala, 26 Nov. 20: Among the important torrents located in the lush green hills of Seshachala ranges, Chakratheertham is considered to be on the most sacred theerthams located in Tirumala.

Due to incessant rainfalls from the past two days, the Chakratheertham is gushing out in full swing. As the Chakratheertha Mukkoti is on Thursday, even the team of archakas, temple staffs performed the celestial puja to the holy waters by offering turmeric, vermilion, flowers and Harati. After so many years, this torrent is in its full swing during its Mukkoti.

DAMS FULL IN TIRUMALA

On the other hand, all the five dams in Tirumala are full to their capacities and TTD authorities have opened up the gates of Gogarbham and Papavinasanam dams. In the last 24hours, starting from 8am of Wednesday till 8am of Thursday, the rainfall recorded in Papavinasanam is 313mm (697.14frl as against its capacity of 698.85frl, at Gogarbham – 247mm(2894frl and its full to its capacity), Akasaganga is 176mm (865frl and it is also brimming with full capacity) while at Kumaradhara and Pasupudhara the rainfall recorded is 155mm each (both dams capacity is 898.24frl and both are full).

PARADISE GAINED IN SEVEN HILLS

The beauty of the Seven Hills enhanced with the torrents flashing out at different points both in up and down ghat roads due to the non-stop down pour in the last two days providing a cynosure to the visting pilgrims and denizens. The Malavadi Gundem, Pancha Theerthams, Kapilatheertham are seen gushing out from the top of the mountains due to the non-stop rains in the last two days. Pilgrims were seen relishing and capturing the beauties of nature in their mobile braving the inclement weather. 

DAM+LEVEL+RAINFALL

PPV DAM- 696.85- 313.00mm

GG DAM- 2894.00- 247.00mm

AKG DAM- 865.00- 176.00mm

KUMARADHARA DAM- 898.24-155.00 mm

PASUPUDHARA DAM- 898.24- 155.00mm

KALYANI DAM- 869.10- 95.00mm

FILTER HOUSE- 125.00mm

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి

తిరుమల, 2020 న‌వంబ‌రు 26: తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి గురువారం జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి చక్రతీర్థానికి  చేరుకున్నారు. తిరుమ‌ల‌లో కురుస్తున్న భారీ వర్షాల కార‌ణంగా చ‌క్ర‌తీర్థం ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తుండ‌డంతో ఈ తీర్థానికి అభిషేకం, పుష్ప నివేద‌న‌, హార‌తి స‌మ‌ర్పించారు.

తిరుమ‌ల‌లో నిండిన జ‌లాశ‌యాలు

తిరుమ‌ల‌లో కురుస్తున్న వ‌ర్షం కార‌ణంగా 5 జ‌లాశ‌యాలు పూర్తిగా నిండాయి. ఇంజినీరింగ్ అధికారులు పాప‌వినాశ‌నం, గోగ‌ర్భం గేట్ల‌ను ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేశారు. బుధ‌వారం ఉద‌యం 8 నుండి గురువారం ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు న‌మోదైన వ‌ర్ష‌పాతంతో జ‌లాశ‌యాల నీటిమ‌ట్టం వివ‌రాలిలా ఉన్నాయి.

– పాప‌వినాశ‌నం డ్యామ్‌లో 313 మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, నీటిమ‌ట్టం 697.14 ఎఫ్ఆర్ఎల్‌గా(పూర్తి నీటిమ‌ట్టం 698.85 ఎఫ్ఆర్ఎల్‌) ఉంది.

– గోగ‌ర్భం డ్యామ్‌లో 247 మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 2894 ఎఫ్ఆర్ఎల్‌(ఫుల్ రిజ‌ర్వాయ‌ర్ లెవ‌ల్‌)గా ఉంది.

– ఆకాశ‌గంగ‌ డ్యామ్‌లో 176 మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 865 ఎఫ్ఆర్ఎల్‌గా ఉంది.

– కుమార‌ధార‌, ప‌సుపుధార డ్యాముల్లో 155 మి.మీ చొప్పున వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 898.24 ఎఫ్ఆర్ఎల్‌గా ఉంది.

తిరుమ‌ల‌లో జ‌ల‌పాతాల సోయగం

తిరుమ‌ల‌లో రెండు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తుండ‌డంతో ప‌లు తీర్థాలు, జ‌ల‌పాతాలు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకున్నాయి. ఎత్త‌యిన కొండ‌ల నుండి జాలువారుతున్న జ‌ల‌పాతాల సోయ‌గం యాత్రికుల‌ను క‌ట్టిప‌డేస్తోంది. మాల్వాడి గుండం, పంచ‌తీర్థాలు, క‌పిల‌తీర్థం జ‌ల‌పాతాలు జ‌ల‌సిరితో ఆక‌ట్టుకుంటున్నాయి. రెండు ఘాట్ రోడ్ల‌లో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ప్ర‌కృతి ర‌మ‌ణీయ దృశ్యాల‌ను యాత్రికులు త‌మ సెల్‌ఫోన్ల‌లో బందిస్తున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.