CHAKRASNANAM AT SRI GT _ చక్రస్నానంతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 26 May 2021: The annual Brahmotsavam festivities concluded at Sri Govindaraja Swamy temple on Wednesday with grand celebrations of Chakra Snanam in Ekantam due to Covid guidelines.

In this connection earlier Snapana Tirumanjanam was performed for the utsava idols of Sri Govindaraja Swamy and His consorts along with Sri Sudarshan Chakrathalwar at the temple mandapam.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswami and Sri Sri Sri Chinna Jeeyarswami, special grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravi Kumar Reddy, Archakas AP Srinivasa Dikshitulu, Kankana Bhattar Sri AT Parthasarathy Dikshitulu, temple inspector Sri Munindrababu and Sri Kamaraj, Superintendents Sri Venkatadri and Sri Kumar and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చక్రస్నానంతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2021 మే 26: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో బుధ‌వారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా చ‌క్ర‌స్నానం నిర్వ‌హించారు.

ఉద‌యం 8.30 నుండి 10.30 గ‌టంల వ‌ర‌కు ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనల‌తో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.

కాగా సాయంత్రం 5.30 గంట‌లకు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఏ.పి.శ్రీ‌నివాస దీక్షితులు, కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఏ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, శ్రీ కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.