CHAKRASNANAM HELD _ వైభవంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

VONTIMITTA BRAHMOTSAVAMS TO CONCLUDE WITH DHWAJAVAROHANAM

Vontimitta, 25 April 2024: On Thursday, the last day of Sri Kodandaramaswamy’s annual Brahmotsavam, Chakrasnanam was held at Pushkarini near the temple.  A significant number of devotees participated and performed holy baths on the occasion.

Swami was awakened in the temple at 4 am with Suprabhatam and the temple was cleaned and worshipped.  From 9.30am onwards Sri Sita Rama Lakshmana sere taken out on a celestial procession to Pushkarini on Tiruchi while, Sri Sudarshan Chakratalwar on a separate palanquin.

From 10.30 am to 11.15 am, Snapana Tirumanjanam was held as a ceremony for the idols.  

Sri Chakratalwar was also rendered abhishekam with milk, curd, honey, turmeric and sandalwood.  After that, the priests performed Chakrasanam while chanting Vedic mantras.

The Brahmotsavam of Sri Kodandarama Swamy will conclude with the Dhwajavarohanam on Thursday night.

Deputy EO Sri Natesh Babu, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Naveen and temple priests participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

– రాత్రి ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 25: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం ఆలయ సమీపంలోని పుష్క‌రిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్‌ పల్లకిలో ఊరేగింపుగా పుష్క‌రిణి వ‌ద్ద‌కు వేంచేశారు.

ఉదయం 10.30 నుండి 11.15 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకాలు అందుకున్నారు. అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ‌ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.