VASANTHOTSAVAM IN KARVETINAGARAM _ ఏప్రిల్ 29 నుండి మే 1వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

Tirupati, 25 April 2024:The annual spring festivals of Vasanthotsavam will be observed in Karvetinagaram Sri Venugopalaswamy temple from April 29 to May 1.

As part of this, every morning the Lord is woken up with Suprabhatam, Tomala, Koluvu, Panchanga Shravana and Archana are performed.  

Between 2.30 pm and 3.30 pm, Snapana Tirumanjanam and Asthanam will be conducted in a grand style to Sri Venugopalaswami along with Sri Rukmini Satyabhama.  

Abhishekam is done with milk, curd, honey, coconut water, turmeric and sandalwood as part of this.

On this occasion, for three days, from 5.30 pm to 7.30 pm, a grand procession of Swami and Ammavarlu will be held along the four Mada streets of the temple.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 29 నుండి మే 1వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

తిరుపతి, 2024 ఏప్రిల్ 25: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 29 నుండి మే 1వ తేదీ వరకు జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 3.30 గంటల వరకు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు.

ఈ సందర్భంగా మూడు రోజులపాటు సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లను ఘనంగా ఊరేగించనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ధార్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.