CHAKRATEERTHA MUKKOTI ON NOVEMBER 30_ నవంబరు 30న తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి
Tirumala, 12 Nov. 17: One of the most important teertha mahotsavams, the Chakra Teertha mukkoti will take place in Tirumala on November 30.
After the morning and noon bells and naivedyam, a team of TTD officials, archakas will go to the Chakra Teertham which is located few miles away on the southern side of the Tirumala shrine in the Seshachalam ranges.
The priests offer special abhishekam and pujas to the Sudarshana Chakrattalwar, Sri Lakshmi Nrisimhaswamy and Sri Anjaneya Swamy located in this holy place. After performing harati they will return to the temple.
According to Skanda purana, a sage Sri Padmanabha Maharshi did 12 years of penance in this area and appeased Lord Venkateswara who granted him the boon of worshipping Him till the end of aeon. One day, a demon tried to kill the sage and the later prayed Lord, who sent His Sudarshana Chakram to protect Sage Padmanabha. The divine disc killed the demon and on the request of the Sage, it resided here and since then has been protecting the devotees from evil forces. So the holy place is named as Chakrateertham.
The Varaha purana describes that there are 66 crore teethas located in Seshachalam ranges. Chakrateertham is considered as the most powerful one after Swamy Pushkarini Teertham. Hence it attained a special place among the seven important Saptha Teerthas located in Tirumala Seshachalam ranges.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు 30న తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి
నవంబరు 12, తిరుమల, 2017: తిరుమలలో జరిగే ఉత్సవాల్లో అత్యంత ప్రముఖమైన చక్రతీర్థ ముక్కోటి ఈ నెల 30వ తేదీన ఘనంగా జరుగనుంది.
పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న శేషగిరులమీద దక్షిణభాగంలో కొన్ని మైళ్ల దూరంలో మహా పవిత్రతీర్థమగు చక్రతీర్థం వెలసివుంది. ప్రతి ఏడాది కార్తీక మాసం శుద్ధద్వాదశినాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది. ఆరోజున స్వామివారికి ప్రాతఃకాల, మధ్యాహ్న ఆరాధనలు పూర్తి అయిన తరువాత అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు, భక్తులు మరియు యాత్రికులు మంగళవాయద్యాలతో స్వామివారు ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారు వారికి, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు ఆరాధన చేస్తారు. హారతి నివేదించిన అనంతరం తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.
పురాణ నేపథ్యంలో స్కంద పురాణానుసారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాల్సిందిగా చెప్పి అంతర్థానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. ఆ తరువాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండే విధంగా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా సుప్రసిద్ధిగాంచింది.
వరాహ పూరాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థాన్ని కూడా చేర్చి ప్రవర తీర్థంగా చెప్పబడింది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.