CHAKRATEERTHAM GETS A FACE LIFT_ భక్తులను ఆకర్షిస్తున్న చక్రతీర్థం
Tirumala, 2 December 2017: One of the most famous water torrent, Chakratheertham located in the lush green forests and rocky hills of Seshachalam ranges in Tirumala donned a new look to welcome more number of pilgrims to enjoy the spiritual scenic beauty.
THE ANTHROPOMORPHIC FORM OF LORD HERE IS SELF MANIFESTED
Chakrateertham assumed the name following the self manifestation of Sri Sudarshana Chakrattalwar, the anthropomorphic form of Lord Maha Vishnu. Located about 3.l Km from Narayanagiri Hills, this gorge welcomes over 6000 pilgrims during ordinary days and over 30000 pilgrims during peak days.
KARTHIKA MASA FESTIVAL
The mukkoti festival for this water falls is being observed in the auspicious month of Karthika on Suddha Dwadasi day. Special puja will be performed on this day to Sudarshana Chakrattalwar, the unique marble Shiva Linga, Sri Lakshmi Narasimha Swamy and Sri Anjaneya statue located in this rocky hill over water falls.
MYTHOLOGICAL IMPORTANCE:
According to Skanda Purana, a Sage Padmanabha did penance for 12 years to appease Sri Maha Vishnu. Moved by the dedication of the Sage, Lord appeared before him and blessed Him with the boon that the sage should offer Him prayers till the end of aeon. One day when a demon tried to attack the sage, the later prayed Lord. The Lord sent his holy disc and killed the demon. Over the request of the sage, Lord instructed His Discuss to remain in the place and protect the devotees from evil forces. Since then the place is named as Chakrateertham.
BARRICADING AND STONE FLOORING ENHANCES VISITORS
With an aim to make this place more pilgrim friendly, TTD has renovated the entire path way. Under the supervision of TTD SE II Sri Ramachandra Reddy, EE Sri Tota Venkateswarulu and his team of engineers taken up the improvement works by providing cut stone flooring from Silathoranam to Chakratheertham at a cost of Rs. 45 00 lakhs last year.
Now with the support of railing the pilgrims could trek the small rocky hill to reach the temples of Sudarshana Chakrattalwar and Lord Shiva. Under the instructions of TTD EO Sri Anil Kumar Singhal, the engineering wing is soon to commence the beautification of temples by erecting gopuram without disturbing the original structures.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
భక్తులను ఆకర్షిస్తున్న చక్రతీర్థం
తిరుమల, 2017 డిసెంబరు 02: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల దివ్యక్షేత్రంలోని తీర్థముక్కోటిలలో అత్యంత ప్రముఖమైన చక్రతీర్థం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఎక్కువమంది భక్తులు సందర్శించేందుకు వీలుగా టిటిడి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయానికి దక్షిణభాగంలో శేషాచల కొండల్లో పచ్చటి ప్రకృతి నడుమ కొలువైన చక్రతీర్థంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు చక్రతీర్థంను సందర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో చక్రతీర్థంలో నీరు బాగా ప్రవహిస్తోంది. ప్రతి ఏడాదీ కార్తీక మాసం శుద్ధద్వాదశినాడు ఈ చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు ఆలయం నుండి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వేంచేపు చేస్తారు. అక్కడ వెలసిన శ్రీ చక్రత్తాళ్వారు వారికి, శ్రీనరసింహస్వామివారికి, శ్రీఆంజనేయస్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు.
అభివృద్ధి పనులు :
చక్రతీర్థాన్ని సాధారణ రోజుల్లో రోజుకు 6 వేల మంది, పర్వదినాలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో 30 వేల మంది వరకు భక్తులు సందర్శిస్తున్నారు. ఇక్కడ పురాతన పాలరాతి శివలింగం, లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామివారి విగ్రహాలు, స్వయంభువుగా వెలిసిన సుదర్శన చక్రత్తాళ్వార్ రూపం ఉన్నాయి. ఇక్కడ శివలింగం వద్ద, చక్రత్తాళ్వార్ వద్ద సహజత్వానికి భంగం కలగకుండా సంప్రదాయబద్ధంగా గోపుర నిర్మాణాలు చేపట్టనున్నారు. చక్రతీర్థానికి భక్తులు సులువుగా చేరుకునేందుకు మెట్లు, బ్యారీకేడ్లను ఇప్పటికే ఏర్పాటుచేశారు. శిలాతోరణం నుండి చక్రతీర్థం వరకు రూ.45 లక్షలతో కట్‌స్టోన్ ఫ్లోరింగ్ ఏర్పాటుచేశారు.
టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఇఇ శ్రీ తోట వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని ఇంజినీరింగ్ అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.
పౌరాణిక నేపథ్యం :
స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు పరవశించిన శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. స్వామి ఆజ్ఞానుసారం పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో తపస్సు చేశాడు. ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. శ్రీ సుదర్శన చక్రం ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా ఆ మహర్షి స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రారతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఇది చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహ పూరాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైన సప్త తీర్థాలలో చక్రతీర్థాన్ని కూడా చేర్చి ప్రవరతీర్థంగా తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.