GOOD RESPONSE FOR FREE MEDICAL CAMP_ CMO DR NAGESWARA RAO_ ఉచిత వైద్య శిబిరానికి టిటిడి ఉద్యోగుల నుండి విశేష స్పందన – సిఎమ్‌వో డా|| నాగేశ్వరరావు

Tirupati, 2 December 2017: The free Mega medical camp for TTD employees set up jointly by the TTD Medical wing and the Chennai based Billroth Hospital attracted over 350 persons, says TTD CMO Dr Nageswar Rao.

The two day camp was conducted on Dec.1 and 2 at the Central Hospital in the TTD Admin building with focus on general issues like blood sugar (diabetes), BP, cancer, gynecology and pregnancy.

The CMO Dr Nageswar Rao thanked the Billroth Hospital which had deputed 7 senior doctors, 3 managers,10 para medical staff to work with the medical and para medical staff of the TTD Medical wing at the mega medical camp.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఉచిత వైద్య శిబిరానికి టిటిడి ఉద్యోగుల నుండి విశేష స్పందన – సిఎమ్‌వో డా|| నాగేశ్వరరావు

డిసెంబరు 02, తిరుపతి, 2017: టిటిడి ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు, విశ్రాంత ఉద్యోగులకు టిటిడి వైద్య విభాగం మరియు చెన్నైకి చెందిన బిల్రోత్‌ హాస్పిటల్స్‌ వారు సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారని టిటిడి ముఖ్య వైద్యాధికారి డా|| డి.నాగేశ్వరరావు తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలో గల కేంద్రీయ వైద్యశాలలో డిసెంబరు 1, 2వ తేదీల్లో నిర్వహించిన వైద్య శిబిరంలో 350 మందికి వైద్య సేవలు అందించినట్లు ఆయన వెల్లడించారు.

రెండు రోజుల పాటు జరిగిన వైద్య శిబిరంలో పిల్లలు లేనివారికి పరీక్షలు నిర్వహించి ప్రత్యేక చికిత్స, స్త్రీల సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే పరీక్షలు, షుగర్‌ వ్యాధులు, తదితర వ్యాధుల రోగులకు వైద్యసేవలు అందించామని అన్నారు. బ్లడ్‌షుగర్‌, బిపి, ప్రత్యేక పరీక్షలు, ప్యాప్స్‌ స్పియర్‌, కాల్‌పోస్కోపీ, అల్ట్రాసౌండ్‌,అబ్‌డనింగ్‌ తదితర పరీక్షలను బిల్రోత్‌ హస్పిటల్‌ నిపుణులు నిర్వహించినట్లు తెలియజేశారు. క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు కూడా చేశామన్నారు.

ఈ సందర్భంగా చైన్నై బిల్రోత్‌ హస్పిటల్‌ నుండి వచ్చిన 7 మంది ప్రముఖ వైద్యులు, ముగ్గురు మేనేజర్లు, 10 మంది పారా మెడికల్‌ సిబ్బంది ఉచితంగా వైద్య సేవలందించారని, వారికి సిఎమ్‌వో ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ మెగా వైద్య శిబిరంలో టిటిడి కేంద్రీయ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.