CHANDA MELAM ATTRACTS DEVOTEES _ సింహ వాహనసేవలో ఆకట్టుకున్నచండ మేళం
TIRUPATI, 13 FEBRUARY 2023:The unique band of Kerala drums, Chanda Melam attracted devotees to a great extent as part of the ongoing annual Brahmotsavams at Srinivasa Mangapuram.
The Govindamani troupe of 13 members from the Kollam district of Kerala have been playing the instrument for the past 38 years and alluring devotees.
Similarly, Rangadthala Kolata Bhajana from Markapuram had children aged between 7-12years in their troupe who performed Kolatam, while teams from Chandragiri, Eluru, and Tirupati performed Chekka Bhajans on Monday in front of Simha Vahanam.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సింహ వాహనసేవలో ఆకట్టుకున్నచండ మేళం
తిరుపతి, 2023 ఫిబ్రవరి 13 ;శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సింహ వాహనసేవలో చండ మేళం, కోలాటం, చక్క భజనలు తదితర కళాప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
38 ఏళ్లుగా కేరళ గోవిందమణి చండమేళం
కేరళ రాష్ట్రం కొళ్లాం ప్రాంతంలోని కొడగల్‌కు చెందిన శ్రీ గోవిందమణి బృందం 38 ఏళ్లుగా చండమేళం(కేరళ డ్రమ్స్) వాయిస్తున్నారు.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో కేరళ డ్రమ్స్ బృందంలో మొత్తం 13 మంది కళాకారులు ఉన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. ఈ వాయిద్య ప్రదర్శన ఎంతో వినసొంపుగా ఉంటుంది.
వీరు టీటీడీ ఆధ్వర్యంలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లోనూ చండ మేళం వాయిస్తారు.
అదేవిధంగా, మార్కాపురంకు చెందిన రంగస్థల కోలాట భజన బృందములోని 7 నుండి 12 సంవత్సరాల వయస్సు గల విద్యార్థిని విద్యార్థులు కోలాటం ప్రదర్శన చేశారు. చంద్రగిరి సమీపంలోని మడమపల్లి కి చెందిన 15 మంది కళాకారులు చక్క భజనలు, ఏలూరు, తిరుపతికి చెందిన భజన బృందాల కోలాటం నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.