SRI KAMAKASHI AMMAVARI CHANDI YAGAM BEGINS AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా ప్రారంభమైన శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగ మహోత్సవం
Tirupati, November 18, 2026: The nine-day Chandi Yagam of Sri Kamakshi Ammavaru began grandly at Sri Kapileswara Swamy Temple in Tirupati on Wednesday as part of the Karthika Masa festivities.
Special pujas, daily homams and Chandi Homam were performed in the morning. Chandi Parayanam and Sahasranamarchana will also be conducted.
Devotees can participate in the homam as grihasthas by purchasing a ticket for Rs.500. They will be provided with traditional clothes and Annaprasadam.
Deputy EO Smt. Nagaratna, AEO Smt. Kumari Devi, Superintendent Sri Chandrasekhar, temple priests and a large number of devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా ప్రారంభమైన శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగ మహోత్సవం
తొమ్మిది రోజుల పాటు విశేష హోమాలు, చండీపారాయణం – భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు
తిరుపతి, 2026 నవంబరు 18: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజా, హోమ మహోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు ఈ యాగ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో విశేష పూజలు, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహించనున్నారు.
భక్తులు రూ.500 టికెట్‌తో ఒకరోజు హోమంలో గృహస్తులుగా పాల్గొనే అవకాశం కల్పించారు. పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





