SILVER ORNAMENTS DONATED TO SRI KRT TEMPLE, CHANDRAGIRI_ చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారికి వెండి అభరణాలు బహుకరణ

Tirupati, 14 December 2018: In all 1800 grams of silver ornaments were donated to the TTD sub temple of Sri Kodandarami temple by devotee Sri Subramanyam Reddy of Chandragiri.

The ornaments including silver crowns to both Swami and Ammavaru, Abhaya hastas, ear rings,Padma hastas were handed over to the TTD local temp,es DyEO Sri K Subramanyam. They were adorned to the deities after special pujas at the Temple Mukha mandapam.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారికి వెండి అభరణాలు బహుకరణ

తిరుపతి, 2018 డిసెంబరు 14: టిటిడి అనుబంధ ఆలయమైన చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారికి చంద్రగిరికి చెందిన శ్రీ సుబ్రమణ్యం రెడ్డి అనే భక్తుడు శుక్రవారం ఉదయం 1800 గ్రాముల వెండి అభరణాలు బహుకరించారు.

ఇందులో స్వామి, అమ్మవార్లకు వెండి కిరీటాలు, అభయహస్తం, కర్ణభూషణాలు, పద్మహస్తాన్ని టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యంకు అందించారు. అభరణాలకు ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

ఈ కార్యక్రమంలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణ చైతన్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.