IMPORTANCE TO COMMON DEVOTEES FOR VAIKUNTHA EKADASI_ వైకుంఠ ఏకాద‌శికి సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాల‌కు పెద్ద‌పీట

Tirumala, 14 December 2018: TTD has made elaborate arrangements for Vaikutha Ekadasi to ensure smooth stay and Vaikuntha Ekadasi Dwara Darshan for pilgrims under the instructions of TTD EO Sri Anil Kumar Singhal in the direct supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju while the security arrangements in the guidance of CV and SO Sri Gopinath Jetti.

The spacious Narayanagiri Gardens which has a holding capacity of 18,500 pilgrims and the four mada street galleries with a holding capacity of nearly 40 thousand pilgrims have been spruced up to meet the needs of the pilgrims who are turning out for the big day.

TTD has divided the entire Narayanagiri premises into ten sectors and constructed 16 sheds for providing shelter to pilgrims instead of making them stand in the queue lines for hours together till their turn for darshan. A total of 229 toilets including 128 for women and 101 for men have been constructed. While in four mada streets have been divided into 16 sectors and 14 sheds have been set up to accommodate pilgrims against inclement weather conditions and 176 toilets for women and 164 toilets for men have been constructed.

About 2500 Srivari Sevakulu have been deployed to serve annaprasadam and water to the pilgrims waiting in Vaikuntham compartments, Narayanagiri Gardens, Four mada streets, Kalyana Vedika etc. TTD has also set up giant LED screens at various points for the sake of the pilgrims.

All the sectors will be supervised by senior officers of TTD and for ensuring better service to pilgrims, TTD has deputed 400 staffs to monitor their amenities.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాద‌శికి సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాల‌కు పెద్ద‌పీట

డిసెంబ‌రు 14, తిరుమల 2018: క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవ‌మైన శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు కొలువైన తిరుమ‌ల‌లో జ‌రిగే ప్రముఖ ప‌ర్వ‌దినాల్లో వైకుంఠ ఏకాద‌శి ఒక‌టి. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల గ‌రుడ‌సేవ త‌రువాత వైకుంఠ ఏకాద‌శికి తిరుమ‌ల‌కు ఎక్కువ మంది భ‌క్తులు వ‌స్తుంటారు. ఈ ఏడాది డిసెంబ‌రు 18న వైకుంఠ ఏకాద‌శి, డిసెంబ‌రు 19న ద్వాద‌శి సంద‌ర్భంగా భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాన్ని టిటిడి క‌ల్పించ‌నుంది. ఇందుకోసం రెండు నెల‌ల ముందునుండి ప్ర‌ణాళికాబ‌ద్ధంగా టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది.

ఈ ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా విచ్చేసే సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాల‌కు టిటిడి పెద్ద‌పీట వేసింది. ద‌ర్శ‌నం, బ‌స‌, అన్న‌ప్ర‌సాదాలు త‌దిత‌ర వ‌స‌తులకు సంబంధించి ఎలాంటి రాజీకి తావు లేకుండా ఏర్పాట్లు చేప‌ట్టింది. వైకుంఠ ఏకాద‌శికి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తులు సుమారు 48 గంట‌ల పాటు కూడా క్యూలైన్ల‌లో వేచి ఉండాల్సి ఉంటుంది. ఇలా వేచి ఉండే భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ప్ర‌త్యేకంగా షెడ్లు ఏర్పాటుచేశారు. నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో 18,500 మంది భ‌క్తులు కూర్చునేందుకు వీలుగా 16 షెడ్లు ఏర్పాటుచేసి 10 సెక్టార్లుగా విభ‌జించారు. వీటికి అనుసంధానంగా మ‌హిళ‌ల కోసం 128, పురుషుల కోసం 101 మ‌రుగుదొడ్లు ఉన్నాయి. ఆల‌య నాలుగు మాడ వీధుల్లో దాదాపు 40 వేల మంది కూర్చునేందుకు వీలుగా 14 షెడ్లు ఏర్పాటుచేసి 16 సెక్టార్లుగా విభ‌జించారు. ఇక్క‌డ మ‌హిళ‌ల కోసం 176, పురుషుల కోసం 164 మ‌రుగుదొడ్లు ఉన్నాయి. మాడ వీధుల్లోని షెడ్ల‌లోకి మేద‌ర‌మిట్ట వ‌ద్ద గ‌ల ఎన్‌1 గేట్ ద్వారా భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు.

ఈ షెడ్ల‌లో భ‌క్తుల‌కు అన్ని వ‌స‌తులను టిటిడి క‌ల్పించ‌నుంది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లోనూ భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేప‌ట్టింది. భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు అందిస్తారు. ప‌లు ప్రాంతాల్లో ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేసి ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేస్తారు. ఆయా షెడ్ల‌లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు శ్రీ‌వారి సేవ‌కులను అందుబాటులో ఉంచుతారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం అద‌నంగా సిబ్బందిని ఏర్పాటుచేసింది. భ‌క్తుల సౌక‌ర్యాల‌ను టిటిడి సీనియ‌ర్ అధికారులు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తుంటారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.