CHANDRAGIRI RAMALAYAM BTU POSTERS RELEASED_ చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

Tirupati, 13 March 2018: The posters of Chandaragiri Ramalayam temple were released by Tirupati JEO Sri P Bhaskar on Tuesday.

The poster release took place in the chambers of Tirupati JEO in TTD administrative building.

The annual fete commences on March 27 with Dhwajarohanam and concludes on April 5 with Sri Rama Pattabhishekam.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

మార్చి 13, తిరుపతి, 2018: టిటిడి అనుబంధంగా ఉన్న చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది.

మార్చి 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 27న ఉదయం 8 నుండి 9 గంటల వరకు ధ్వజారోహణం జరుగనుంది. మార్చి 30న రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఏప్రిల్‌ 1న సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరుగనున్నాయి. ఏప్రిల్‌ 4న ఉదయం 9 నుండి 10 గంటల వరకు వసంతోత్సవం, ఉదయం 10.30 నుండి 11.45 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఏప్రిల్‌ 5వ తేదీ సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీరామపట్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తారు.

గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీసుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకరరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.