TIRUMALA KITCHENS TO GET MECHANISED LOOK_ తిరుమలలోని అన్నప్రసాద భవనాలలో పూర్తిస్థాయిలో యాంత్రీకరణ చేపట్టాలి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
Tirumala, 13 March 2018: To improve serving of food and milk distribution in Tirumala, the kitchens in Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) and Vaikuntham Queue Complex – 2 should get a mechanised look, said, Tirumala JEO Sri KS Sreenivasa Raju.
During the weekly review meeting at Annamaiah Bhavan in Tirumala on Tuesday, the JEO instructed the officials concerned to invite the opinion of IIT experts on how to mechanize and automatize the kitchens in Tirumala.
The JEO also reviewed on the status of works with respect to Slotted Sarva Darshan (SSD) counters with Engineering and IT wings.
CE Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji, SEs Sri Ramachandra Reddy, Sri Ramesh Reddy, Temple DyEO Sri Harindranath, GM Sri Sesha Reddy, CIO Sri Sudhakar Bhaskaruni and other officers were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలోని అన్నప్రసాద భవనాలలో పూర్తిస్థాయిలో యాంత్రీకరణ చేపట్టాలి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
మార్చి 13, తిరుమల 2018: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత రుచికరమైన భోజనం అందించేందుకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదభవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ – 2లోని వంటశాలలను యాంత్రీకరించాలని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తులకు అందించే అన్నప్రసాదాలు, పాలు వంటివి మరింత సౌకర్యావంతంగా అందించేందుకు తిరుమలలోని వంటశాలలను మరింత ఆధునీకరించాలన్నారు. ఇందులో భాగంగా చెన్నైలోని ఐఐటి నిపుణులతో వంటశాలలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం తిరుపతి, తిరుమలలో ఏర్పాటు చేయనున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌటర్ల నిర్మాణ పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించి, పలు సూచనలు చేశారు. అదేవిధంగా టిటిడి ఐటి విభాగం టిసిఎస్ అధికారులతో సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రామచంద్రరెడ్డి, శ్రీ రమేష్‌రెడ్డి, జియం శ్రీ శేషారెడ్డి, సిఐవో శ్రీ సుదాకర్ భాస్కరుని, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో అన్నమయ్య 515వ వర్థంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 515వ వర్థంతి మహొత్సవాలకు నారాయణగిరి ఉద్యానవనాలలొ టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి
ఉద్యానవనాలకు చేరుకుంటారు. ఈ సందర్బంగా శ్రీ అహోబిల మఠం 46వ మఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ అనుగ్రహభాషణం చేయనున్నారు.
అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు. అటు తరువాత స్వామివారు ఉభయదేవేరులతో కూడి ఆలయానికి వేంచేపు చేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.