CHANDRAPRABHA CONCLUDES SAPTHA VAHANA SERIES _ చంద్ర‌ప్రభ వాహనంపై శ్రీ మలయప్ప అభయం

TIRUMALA, 28 JANUARY 2023: With Sri Malayappa taking a celestial ride on the finely decked Chandra Prabha Vahanam-the Moon God carrier, the Sapta Vahana Sevas concluded on a grand religious note on Saturday in connection with Radhasapthami.

The day began for the devotees on a bright note with Suryaprabha and the curtains came down for the Seven Celestial Vahanams with the Lord giving a chill-thrill on the soothing Chandraprabha vahanam.

Board members Sri Ramulu, Sri Ashok Kumar, Sri Madhsudhan Yadav, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చంద్ర‌ప్రభ వాహనంపై శ్రీ మలయప్ప అభయం

తిరుమల, 28 జనవరి 2023: తిరుమలలో శనివారంనాడు ‘రథసప్తమి’ ఉత్సవం సందర్భంగా చివరి వాహనమైన చంద్రప్రభ వాహనసేవ ఘనంగా జరిగింది.

చంద్ర‌ప్రభ వాహనం – సకలతాపహరం (రాత్రి 8 నుండి 9 గంటల వరకు) :

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ మొరంశెట్టి రాములు, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ మధుసూదన్ యాదవ్, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు ఇత‌ర టిటిడి అధికారులు ఈ వాహ‌న సేవ‌లో పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.