PADMAVATHI AS “NANDAGOPALA KRISHNA” CHARMS DEVOTEES ON CHANDRAPRABHA_ చంద్రప్రభ వాహనంపై సిరుల తల్లి

Tiruchanoor, 10 December 2018: The pleasant evening on Monday witnessed Goddess taking ride on the cool Chandra prabha Vahanam as “Nanda Gopala Krishna” as a part of the ongoing annual brahmotsavams in Tiruchanoor.

Chandra, the most charming and infact the name itself signifies shining md bright and is often regarded as Loveable God in Hindu mythology. When Sun is often described as the indicator of the soul, the Moon is the vehicle of the mind that receives the light of the soul.

With the concept of Nanda Gopala Krishna taking care of Gokula and Gopala, with herd of cows, the de voters had a chill thrill to fitness Goddess on the soothing Chandra prabha Vahanam.

TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy,Dy.EO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy and others were present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

చంద్రప్రభ వాహనంపై సిరుల తల్లి

తిరుపతి, 2018 డిసెంబరు 10: రాత్రి 8.00 గంటల నుండి 11.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, చంద్రగిరి శాసన సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ గోపినాధ్‌ జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజివో అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.