ALL SET FOR PANCHAMI THIRTHAM_ పంచమీ తీర్థనికి పటిష్ట ఏర్పాట్లు
Tiruchanoor, 11 December 2018: TTD has made all arrangements for the conduction of Panchami Thirtham event on Wednesday at Tiruchanoor.
The engineering department has put up barricades, separate entry and exit gates in to Pushkarini besides relevant signboards around the puskarini. Security and vigilance has been tightened with 1500 personnel including 300 TTD staff, 300 scouts and guides, 300 Srivari Sevakulu and 200 local police.
TTD has set up 60 Anna pradadam counters besides providing water bottles, snacks, Anna pradadam, butter milk in the queue lines. In all 314 toilets are readied and necessary staff rolled for cleaning around temple along with signboards about sanitary facilities. Darshan hours, parking and others.
Special parking arrangements have been made for devotees coming for Panchami Thirtham event at Shilparamam, market yard, Tanavalli cross, Ramanaidu Kalyana mandapam, Pudi junction, Tiruchanoor Harijanwada and a VIP parking at panchayat office.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
పంచమీ తీర్థనికి పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి, 2018 డిసెంబరు 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబరు 12వ తేదీ బుధవారం జరుగనున్న పంచమీ తీర్థనికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది.
ఇంజినీరింగ్
పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, పద్మపుష్కరిణిలోనికి ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, సూచిక బోర్డులు తదితర ఇంజినీరింగ్ పనులు పూర్తయ్యాయి.
భద్రత
తిరుచానూరుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టిటిడి భద్రత, నిఘా విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా టిటిడి భద్రతా సిబ్బంది 300 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్.సి.సి.విద్యార్థులు 200, శ్రీవారి సేవకులు 200, పోలీస్ సిబ్బంది 1500 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
అన్నప్రసాదం కౌంటర్లు
భక్తుల సౌకర్యార్థం అదనంగా 60 అన్నప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. తోళ్ళప్ప గార్డన్స్‌లో 26, ఎస్వీ హైస్కూల్ వద్ద 18, శ్రీ అయప్పస్వామివారి ఆలయం వద్ద 16 అన్నప్రసాదం కౌంటర్లలో పంపిణీ చేస్తారు. అదేవిధంగా క్యూలైన్లలోని భక్తులకు అవసరమైన తాగునీరు, అల్పాహరం, అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేస్తారు.
మరుగుదొడ్లు –
ఇందులో భాగంగా 314 శాశ్వత, తాత్కలిక, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమైన అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు.
సూచిక బోర్డులు –
అమ్మవారి దర్శన సమయం, అన్నప్రసాదాలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాలలో సూచిక బొర్డులు ఏర్పాటు చేశారు.
వైద్యం –
వైద్య, పారా మెడికల్ సిబ్బంది, 3 ప్రాంతాలలో ప్రథమచికిత్స కేంద్రాలు, 4 అంబులెన్స్‌లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. స్విమ్స్, రూయా ఆసుపత్రులకు చెందిన వైద్యులు, ఆయుర్వేద వైద్యులు భక్తులకు సేవలందిస్తారు. అదేవిధంగా ఫైర్, జాతీయ విపత్తు నివారణ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
పార్కింగ్ –
పంచమి తీర్థాన్నికి విచ్చేసే భక్తులకు శిల్పారామం, తనపల్లి క్రాస్, మార్కెట్‌యార్డు, రామానాయుడు కల్యాణ మండపం, పూడి జంక్షన్, తిరుచానూరు హరిజనవాడ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రముఖులకు తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా పార్కింగ్ ఏర్పాటు చేశారు.
శ్రీవారి సేవకులు –
పంచమి తీర్థంలో భక్తులకు సేవలందించేందుకు దాదాపు 450 మంది శ్రీవారి సేవకులు టిటిడిలోని వివిధ విభాగాలలో సేవలందిస్తారు.
పద్మపుష్కరిణిలో ఉదయం 11.42 గంటలకు మకరలగ్నంలో చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. పంచమీ తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.