CHANGES IN DARSHAN TIMINGS OF SRI PAT _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య ద‌ర్శ‌న వేళ‌ల్లో మార్పు

Tirupati, 5 May 2021: Keeping health safety of devotees and adherence to Covid guidelines then TTD has decided to conduct all arjita sevas of Sri Padmavati temple, Tiruchanoor in Ekantha and cancelled evening break Darshan and made few changes in Sarva Darshan Timings.

TTD has scheduled Sarva Darshan between 08.30-11.30 am every day after daily rituals, Ekantha arjita sevas and morning break Darshan for half an hour between 11.30-12.00 noon. Temple will be closed at 12.45 till 4.00 pm.

Evening Sarva Darshan begins from 4.00-6.00 pm and after Ekantha sevas including Unjal Seva, the temple will be closed at 7.15 pm.

On Friday’s after abhisekam to Mula Virat, Sarva Darshan is allowed from 09.00-11.30 am and thereafter break Darshan till 12.00 noon.

Again after daily rituals, Sarva Darshan is allowed from 12.30- 6.00 pm and Ekantha arjita sevas will continue till closure at 7.15 hours.

TTD has appealed to devotees to note the changes in Sarva Darshan and break Darshan timings and act accordingly.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య ద‌ర్శ‌న వేళ‌ల్లో మార్పు

తిరుపతి, 2021 మే 05: కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా, భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌తను దృష్టిలో ఉంచుకుని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, ఉప ఆల‌యాల ద‌ర్శ‌న వేళ‌ల్లో టిటిడి మార్పులు చేప‌ట్టింది. ఆల‌యాల్లోని సేవ‌ల‌న్నీ ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నాన్ని టిటిడి ర‌ద్దు చేసింది.

ప్ర‌తి రోజూ ఉద‌యం 6 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం, 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు స‌హ‌స్ర‌నామార్చ‌న‌, నిత్యార్చ‌న‌, శుద్ధి, మొద‌టి గంట‌, ఉద‌యం 8.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం, ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం, ఉద‌యం 11.30 నుండి 12 గంట‌ల వ‌ర‌కు బ్రేక్ ద‌ర్శ‌నం, మ‌ధ్యాహ్నం 12 నుండి 12.30 గంట‌ల వ‌ర‌కు శుద్ధి, రెండో గంట త‌రువాత మ‌ధ్యాహ్నం 12.45 గంట‌ల‌కు ఆల‌యం త‌లుపులు మూసివేస్తారు. ఆ త‌రువాత సాయంత్రం 4 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచి సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ముఖ మండ‌పంలో ఊంజ‌ల్ సేవ నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శుద్ధి, రాత్రి గంట త‌రువాత రాత్రి 7.15 గంట‌ల‌కు ఏకాంత సేవ చేప‌ట్టి ఆల‌యం తలుపులు మూసివేస్తారు.
         
విశేష‌మైన శుక్ర‌వారం నాడు ఉద‌యం 4.30 నుండి 5 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం, 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు స‌హ‌స్ర‌నామార్చ‌న‌, నిత్యార్చ‌న‌, శుద్ధి, మొద‌టి గంట‌, ఉద‌యం 6.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు మూల‌వ‌ర్ల‌కు అభిషేకం, ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అలంకారం, ఉద‌యం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం, ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం, ఉద‌యం 11.30 నుండి 12 గంట‌ల వ‌ర‌కు బ్రేక్ ద‌ర్శ‌నం, మ‌ధ్యాహ్నం 12 నుండి 12.30 గంట‌ల వ‌ర‌కు శుద్ధి, రెండో గంట త‌రువాత మ‌ధ్యాహ్నం 12.30 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. సాయంత్రం 3 నుండి 4 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ ముఖ‌మండ‌పంలో అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం చేప‌డ‌తారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు అలంకారం, సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ‌, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శుద్ధి, రాత్రి గంట త‌రువాత రాత్రి 7.15 గంట‌ల‌కు ఏకాంత సేవ చేప‌ట్టి ఆల‌యం తలుపులు మూసివేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.