CHANGES IN SSD TOKENS ISSUANCE FOR VAIKUNTHADWARA DRASHAN _ సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీలో స్వల్ప మార్పు

Tirumala, 18 Dec. 20: The Sarva Darshan time slot tokens which are being issued at the counters of Vishnu Nivasam and Bhudevi complex near Alipiri in Tirupati, will be closed on 5pm of December 21. The tokens for December 22, 23 and 24 will also be issued on or before December 21 itself. The devotees are requested to make note of this change.

Following the Covid norms and keeping in view the past experience of law and order problem and other issues, this year, the Vaikuntha Dwara Darshan tokens will be limited to only local devotees. It is requested that non-locals need not come for darshan tokens. Following the Covid norms, the locals shall have to bring their Aadhaar cards and obtain the SSD dasrhan tokens which will be issued at the five designated centres in Tirupati.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీలో స్వల్ప మార్పు
 
తిరుమ‌ల‌, 2020 డిసెంబ‌రు 18: తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో గల కౌంటర్లలో డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను మూసివేయడం జరుగుతుంది. డిసెంబర్ 22, 23, 24వ తేదీలకు సంబంధించిన టోకెన్లను  కూడా డిసెంబర్ 21వ తేదీ లోపు జారీ చేస్తారు.  భక్తులు ఈ మార్పును గమనించి టిటిడికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
 
కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మ‌రియు గ‌తంలో జ‌రిగిన శాంతిభ‌ద్ర‌త‌లు, ఇత‌ర అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప‌ర్యాయం వైకుంఠ ఏకాద‌శి స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు స్థానికుల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేయ‌డ‌మైన‌ది. ద‌య‌చేసి స్థానికేత‌రులెవ్వ‌రూ టోకెన్ల కొర‌కు రావద్దని మనవి చేయడమైనది. స్థానికులు కూడా ఆధార్ కార్డు తీసుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్దేశించిన 5 ప్రాంతాలకు వచ్చి టోకెన్లు పొందాలని కోరడమైనది.
 
 తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.