CHATRASTHAPANOTSAVAM PERFORMED IN TIRUMALA _ నారాయణగిరిలో వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

TIRUMALA, JULY 20: The annual festival of Chatrasthapanotsavam at Narayanagiri Padalu has been performed with religious pomp and gaiety in Tirumala on Saturday.
 
According to temple legend, Lord Venkateswara first landed onthis Narayanagiri mountain before entering into Srivari temple, which is considered to be the highest point ofSeven Hills of Tirumala. To mark this ceremonial occasion, Chatrasthapanotsavam has been performed where in a new traditional Umbrella was brought and special pujas were performed to Srivari Padalu.
 
TTD Trust board chief Sri Kanumuru Bapiraju, Temple Peishkar Sri R.Selvam, Parpathyedar Sri Doraswamy Naik and others took part in this festival.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నారాయణగిరిలో వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

తిరుమల, 20 జూలై  2013 : తిరుమల పర్వతశ్రేణుల్లోనే అత్యంత ఎత్తైన శిఖరంగా భాసిల్లుతున్న నారాయణగిరి శ్రీవారి పాదాలచెంత ఛత్రస్థాపన మహోత్సవం శనివారంనాడు అత్యంత వైభవంగా జరిగింది.

శ్రీవారు భూలోకానికి ఏతెంచినప్పుడు తొలిసారిగా పాదాలు మోపిన దివ్యస్థలంగా ప్రసిద్ధిగాంచిన నారాయణగిరి పాదాలచెంత ఈ ఛత్రస్థాపన మహోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితి. ఈ సందర్భంగా శ్రీవారి పాదాలకు శాస్త్రోక్తంగా పూజాదికార్యక్రమాలను అర్చకులు నిర్వహించి నూతన ఛత్రాన్ని అక్కడ ప్రతిష్టింప చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు.

ఈ కార్యక్రమంలో తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.