CHATURMASA DEEKSHA OF TIRUMALA PONTIFFS TO COMMENCE ON JULY 21_ జూలై 21న తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చతుర్మాస దీక్ష

Tirumala, 19 Jul. 19: The pontiffs of Tirumala, HH Sri Periyakovil Kelviyappan Shadagopa Ramanuja Pedda Jiyangar Swamy along with his junior pontiff, HH Sri Narayana Ramanuja Chinna Jiyangar swamy will commence Chaturmasa Deeksha with utmost devotion on Sunday, the July 21.

Chaturmasa Deeksha is one of the most important religious fetes followed by the saintly persons during the four months- Shravana, Bhadrapada, Aaswayuja and Karteeka as per Hindu Sanatana Dharma seeking the well being of entire humanity. The seers perform sacred deeds like Snana, Japa, Tapa, and Homa etc. with utmost devotion during this period.

On this auspicious occasion, the seers offer prayers in the temple of Sri Bhu Varahaswamy and later on move to Srivari temple where they will be accorded traditional welcome by the religious team of the temple and officers.

Lord Sri Maha Vishnu is believed to have slept for four months in the milk ocean i.e. from Ashada Shuddha Ekadashi to Karthika Shuddha Ekadashi. Ashada Shuddha Ekadashi is also known as Sayana Ekadashi or Tholi Ekadashi and Lord wakes up from his sleep on Karthika Shuddha Ekadashi, which is also known as Utthana Ekadashi. During this period the saintly persons perform Vrata, which is known as Chaturmasa Deeksha.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 21న తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చతుర్మాస దీక్ష

తిరుమల, 2019 జూలై 19: జూలై 21వ తేదీన తిరుమలలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చతుర్మాస దీక్ష ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం దీక్ష సంకల్పం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

పురాణాల ప్ర‌కారం ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.

హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీ.

తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి తిరుమల శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం ప్రక్కన ఉన్న జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో కూడి ముందుగా శ్రీవరాహస్వామివారి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేస్తారు.

శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత టిటిడి కార్యనిర్వహణాధికారి, ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలో తిరుమల శ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీ చిన్న జీయంగారికి నూల్‌ చాట్‌ వస్త్రాన్ని బహుకరిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికార ప్రముఖులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.