PAVITHROTSAVAM AT THALLAPAKA SRI CHENNAKESAVA TEMPLE_ సెప్టెంబరు 3 నుండి 5వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామివారి పవిత్రోత్సవాలు
Tirupati, 01 Sep 2019: TTD is organising the unique event of Pavithrotsavam at its local temple of Sri Channakesava Swamy temple at Tallapaka In Kadapa District from Sep3-5 with Ankurarpanam on September 2nd.
Amidst Vedic rituals, on all three days, the Pavithrotsavam is aimed at warding off the negative impact of any lapses, if any, which occurred during yearlong festivities in the temple.
The artists of the cultural wings of TTD like HDPP and Annamacharya Project will render Bhakti sangeet, bhajans and kolatas on all three days.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు 3 నుండి 5వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2019 సెప్టెంబరు 01: టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు సెప్టెంబరు 3 నుండి 5వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణం, రక్షాబంధనం, మ త్సంగ్రహణం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇందులో భాగంగా సెప్టెంబరు 3వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు చతుష్టార్చన, బింభ, మండల, కుంభ, కుండల ఆరాధనలు, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు యాగశాలపూజ, పవిత్రహక్షమము నిర్వహిస్తారు. సెప్టెంబరు 4వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యహ్నం 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 5న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం 6.00 గంటల నుండి స్వామి, అమ్మవార్లవీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.