SRINIVASA KALYANAM IN SRIKAKULAM AND VIZIANAGARAM DISTS IN SEPTEMBER_ సెప్టెంబరు 5 నుండి 19వ తేదీ వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

Tirupati, 01 Sep 2019: TTD is organising the unique festival Of Srinivasa Kalyanams from September 5-19 at seven locations each in Srikakulam and Vizianagaram Districts.

The Events organised by the Srinivasa Kalyanam Project will be held at 6.00 in the evenings each day.

SCHEDULE FOR SRIKAKULAM DIST

September 5: At Sri Vinayaka temple of Patlakhanda village of Sompeta Mandal.
September 6: At Santoshi Mata temple of Gokarnapuram village of Kanchili Mandal.
September 7: At Sitarama temple of Kotipalli village of Nandigam Mandal.
September 8: At SC colony of Gaothupuram village of Nandigam Mandal.
September 9: At Suradavanioeta fishermen village of Polaki Mandal.
September 10: Sri Koduramma temple of Barlipadu village of Polaki Mandal.
September 11: At ZP school grounds of Chakipalli village of Tekkali Mandal.

AT VIZIANAGARAM DIST:

September 13; ST colony of Podi village of Kurupam Mandal.

September 14: ST colony of Vattayadoravalasa village of Karunambika Mandal.

September 16: ST colony of Dangabhadra village of Komrada Mandal.

September 17: ST colony of B GadabavalaSa village of Parvatipuram Mandal.

September 18: ST colony of Subhadra Sitaramaouram village of Sitanagaram Mandal.

September 19: ST Colony Of MPalikavalaka village if Makkuva Mandal.

The TTD is organising the colorful and devotional events in remote locations to spread the glory of Lord Venkateswara and also assist the devotees from long and expensive journeys.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 5 నుండి 19వ తేదీ వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2019 సెప్టెంబరు 01: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరు 5 నుండి 19వ తేదీ వరకు

శ్రీకాకుళం జిల్లాలో 7 ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలో 7 ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. ఆయా ప్రాంతాలలో సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి.

శ్రీకాకుళం జిల్లా:

– సెప్టెంబరు 5వ తేదీన సోంపేట మండలం, పొట్రఖండ గ్రామంలోని శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– సెప్టెంబరు 6న కంచిలి మండలం, గోకర్ణపురం గ్రామంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– సెప్టెంబరు 7న నందిగం మండలం, కోటిపల్లి గ్రామంలోని సీతారామాలయంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– సెప్టెంబరు 8న నందిగం మండలం, రౌతుపురం గ్రామంలోని యస్‌.సి.కాలనీలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– సెప్టెంబరు 9న సంతబొమ్మాలి మండలం, మత్య్సకార గ్రామం, సురదవనిపేటలో శివ రామాలయంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– సెప్టెంబరు 10న పోలాకి మండలం, బార్జిపాడు గ్రామంలోని యస్‌.సి.కాలని శ్రీ కోడురమ్మ ఆలయంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– సెప్టెంబరు 11న టెక్కలి మండలం, చాకిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

విజయనగరంజిల్లా:

– సెప్టెంబరు 13న కురుపాం మండలం, పోడి గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– సెప్టెంబరు 14న కురుపాం మండలం, పట్టాయదొరవలస గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– సెప్టెంబరు 15న జియ్యమ్మవలస మండలం, చిలకలవేణివలస గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– సెప్టెంబరు 16న కొమరాడ మండలం, దంగభద్ర గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– సెప్టెంబరు 17న పర్వతీపురం మండలం, బి.గడబవలస గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– సెప్టెంబరు 18 సీతానగరం మండలం, సుభద్ర సీతారామాపురం గ్రామంలోని ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– సెప్టెంబరు 19న మక్కువ మండలం, ఎమ్‌.పాలికవలస గ్రామంలోని ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.