LORD RIDES ON CHINNASESHA VAHANAM_ చిన్నశేషుడిపై గోవిందుడి కటాక్షం

Tirupati, 22 May 2018: On the sunny morning of the on-going annual Brahmotsavams of Lord Govindaraja Swamy rode on Chinna Sesha Vahanam and blessed devotees on Monday. The entourage of caparisoned elephants, kolatas and drum beating enhanced the devotional quotient of the parade. In the Srivaishnava traditions of Agama the Chinna Sesha Vahanam is very sacred and the devotees befit Yogasiddhi phalam.

As part of the Brahmotsvams, Snapana Tirumanjanam was performed in the afternoon with milk, curd, honey, sandal paste, fruit juices and coconut water to the utsava idols of Lord along with his consorts. The deities was accorded unjal seva in the evening and parade on the Hamsa vahanam at night.

Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, Local temples DyEO Smt Varalakshmi, AEO Sri Udayabhaskar Reddy, Supdt, Sri Jnana Prakash and other temple officials and devotees participated in the grand Brahmotsavam events through out the day.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చిన్నశేషుడిపై గోవిందుడి కటాక్షం

తిరుపతి, 2018 మే 22: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్టమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీశక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం. చిన్నశేష వాహనం ”వాసుకి” గాను భావించవచ్చును. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం – శేషవాహనం ఈ శేషశేషి భావాన్ని సూచిస్తోంది. చిన్నశేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండలినీ యోగసిద్ధిఫలం లభిస్తుంది.

ఆనంతరం ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఊంజల్‌సేవ జరగనుంది. రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సోహం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.