GRAND RESPONSE FOR TTDs MAHABHARATHAM BOOK_ కవిత్రయ మహాభారతం గ్రంథానికి విశేష ఆదరణ

Tirupati, 22 May 2018: The TTD publication of popular Kavitraya Mahabharatam written in simple language by Telugu pundits and priced at Rs.345 has been well received by devotees.

The popular 4 Telugu writers Sri Divakarla Venkatavdhani, Sri Nanduri Ramakrishna acharyulu, Sri A Venkatsubbaiah, Sri M Satyanarayana had penned the epic Mahabharatham in 18 chapters of 15 volumes in simple common mans language and the TTD had published it in colorful manner so that it could be retained in the drawing room of every home.

The Mahabharatam volumes could be obtained at the TTD publications sales counter in the TTD Press complex besides the TTD Library.

Free download from ebooks.torumala.org website.

The popular Kavitraya Mahabharatam is also uploaded on the TTD website- www.tirumala.org and it could be free downloaded from the ebooks.tirumala.org link as well.

POSTAL DELIVERY ALSO PROVIDED

The devotees could get the epic book by post also by sending a DD in the name of Executive Officer, TTD, Tirupati for the cost along with postal charges with a covering letter to the Dy EO, TTD publication and sale wing, TTD press compound, KT Road, Tirupati. For all details contact the TTD Publications wing -0877-2264209

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

కవిత్రయ మహాభారతం గ్రంథానికి విశేష ఆదరణ

తిరుపతి, 2018 మే 22: టిటిడి ఇటీవల అందరికీ అర్థమయ్యేలా సరళంగా, ఆకర్షణీయంగా రూపొందించిన కవిత్రయ మహాభారతం గ్రంథానికి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ గ్రంథం ధరను రూ.3,425/-గా టిటిడి నిర్ణయించింది.

మహాభారతం గ్రంథాన్ని సరళీకృతం చేయడంలో శ్రీ దివాకర్ల వేంకటావధాని, శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు, శ్రీ అప్పజోడు వెంకటసుబ్బయ్య, శ్రీ మధునాపంతుల సత్యనారాయణ ఎంతగానో కృషి చేశారు. 18 పర్వాల మహాభారతం 15 సంపుటాల్లో భక్తులకు అందుబాటులో ఉంది. భారతీయ హైందవ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ గ్రంథం ప్రతి ఇంట్లో ఉండాలనే తలంపుతో టిటిడి ముద్రించింది. తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయకేంద్రాలతోపాటు తిరుపతిలోని ప్రెస్‌ కాంపౌండ్‌ ఆవరణలో గల ఆధ్యాత్మిక గ్రంథాలయంలోనూ ఈ గ్రంథాన్ని భక్తులు కొనుగోలు చేయవచ్చు.

ఉచితంగా డౌన్‌లోడ్‌ అవకాశం…

కవిత్రయ మహాభారతం గ్రంథాన్ని భక్తులందరికీ చేరువ చేయడంలో భాగంగా టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. www.tirumala.org వెబ్‌సైట్‌లో ‘ఈ-పబ్లికేషన్స్‌’ను క్లిక్‌ చేయడం ద్వారా లేదా ebooks.tirumala.org లింక్‌ ద్వారా భక్తులు ఈ గ్రంథాన్ని చదువుకోవడంతోపాటు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పోస్టు ద్వారా గ్రంథం కావాలంటే…

కవిత్రయ మహాభారతం గ్రంథాన్ని పోస్టు ద్వారానూ భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ”కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ”ఉపకార్యనిర్వహణాధికారి, ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి” అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. టు పే విధానం(పోస్టల్‌ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు ఈ గ్రంథాన్ని పంపుతారు. ఇతర వివరాలకు టిటిడి ప్రచురణల విభాగం కార్యాలయాన్ని 0877-2264209 నంబరులో సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.