CHRYSANTHEMUM FOR ABHISHEKAM _ ఆకాశ‌గంగా శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో వైభవంగా చామంతి పుష్పాల‌తో విశేష‌ అర్చన

TIRUMALA, 04 JUNE 2024: On the fourth day, Sri Anjanadevi sameta Balanjaneya Swamy was rendered a special floral tribute with the Chrysanthemum.
 
After Abhishekam, the deities were offered Chamanti flowers amidst the chanting of Sahasranama Archana.
 
Vaikhanasa Advisor Sri Mohana Rangacharyulu, archakas were present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
 

ఆకాశ‌గంగా శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో వైభవంగా చామంతి పుష్పాల‌తో విశేష‌ అర్చన

తిరుమ‌ల‌, 2024 జూన్ 04: తిరుమ‌ల‌లో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ స్థ‌ల‌మైన ఆకాశ‌గంగ‌లో శ్రీ అంజ‌నాదేవి స‌మేత శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో మంగళవారం ఉద‌యం స్వామివారికి ఎంతో ప్రీతి పాత్ర‌మైన‌ చామంతి పుష్పాల‌తో విశేష సహస్ర నామార్చనను అర్చకులు నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ వైఖాన‌స ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ మోహ‌న‌రంగాచార్యులు సంతానం, భూవివాదాలు, తదితర సమస్యలు తొలగిపోవాలంటే హనుమంతుని సేవించడం శ్రేష్టమని, ఆంజనేయస్వామి వైభవం గురించి వివరించారు. అనంతరం స్వామివారికి పంచామృత స్న‌ప‌న తిరుమంజ‌నం జరిగింది.

ఈ కార్య‌క్ర‌మాల్లో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.