CJI JUSTICE NV RAMANA OFFERS PRAYERS AT SRIVARI TEMPLE _ శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

Tirumala, 15 Oct. 21: Chief Justice of India at Supreme Court Justice NV Ramana offered prayers at Srivari temple on Friday morning.

 

He was given a warm traditional welcome at the temple Mahadwaram by TTD EO Dr KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy. After Srivari Darshan the Chief Justice was presented Veda Ashirvachanam at Ranganayakula Mandapam. Thereafter the TTD EO presented Srivari thirtha Prasadam, portrait, 2022 diary/calendars and TTD agarbatti’s.

 

Later the CJI offered prayers at Bedi Anjaneya temple and followed with performing the ritual of lighting camphor and breaking coconut at Akhilandam.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
   
తిరుమల, 2021అక్టోబరు 15: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జస్టిస్ రమణకు టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు.

ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి శ్రీ ఎన్వీ రమణకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, 2022 డైరీ, క్యాలెండర్, టిటిడి తయారు చేసిన అగరబత్తులు అందజేశారు.

శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.