CJI NV RAMANA AT TIRUMALA _ తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

Tirumala, 14 October 2021: Chief Justice of Supreme Court Justice Sri NV Ramana arrived in. Tirumala on, Thursday evening for Srivari Brahmotsavam Darshan.

He was accompanied by Supreme Court justice Hima Kohli, AP high court Chief Justice Prashant Kumar Mishra, high court judges Justice Lalita Kumari and Justice Satyanarayana Murthy.

They were received at the Sri Padmavati Rest House and presented warm welcome by TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti and others.

  Earlier the CJI Justice Sri NV Ramana visited the Sri Padmavati temple at Tiruchanoor and offered prayers to Goddess Sri Padmavati.

He was revived by the TTD JEO Sri Veerabrahmam and facilitated Darshan of Goddess Sri Padmavati.

Thereafter Veda pundits offered Veda Ashirvachanam to the CJI and presented Ammavari Thirtha Prasadam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

తిరుమల, 2021 అక్టోబ‌రు 14: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. సిజె వెంట సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, రాష్ట్ర‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ల‌లిత‌కుమారి, జస్టిస్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి ఉన్నారు.

శ్రీ పద్మావతి అతిథి గృహల వద్ద ఆయనకు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఇత‌ర ఉన్నాతాధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు.

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సిజె :

అంత‌కుముందు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.ర‌మ‌ణ దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, అర్చ‌కులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ద‌ర్శ‌నానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.