CJI OFFERS PRAYERS AT SRIVARI TEMPLE _ శ్రీ వారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
Tirumala,19, August: Supreme court Chief Justice of India Justice NV Ramana on Friday offered prayers at Srivari Temple
He was received with temple honours at Maha Dwaram by TTD chairman Sri YV Subba Reddy and state deputy CM Sri Narayana Swamy.
After Srivari Darshan he was presented with Veda ashirvachanam followed by Srivari thirtha Prasadam.
Telangana high court Chief Justice Ujjwal Bhuyan, TTD EO Sri AV Dharma Reddy, CVSO Sri Narasimha Kishore, Temple EO Sri Ramesh Babu were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ వారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
తిరుమల 19 ఆగస్టు 2022: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి జస్టిస్ రమణ కు స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణగా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు .
రంగనాయకుల మండపం లో వేద ఆశీర్వచనం అనంతరం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు . తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయన్ , టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి , సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్ ,ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు పాల్గొన్నారు .
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది