CJI OFFERS PRAYERS IN SRINIVASA MANGAPURAM _ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

TIRUPATI, 28 DECEMBER 2022: After offering prayers at Alarmelu Mangapuram in Tiruchanoor, the Honourable Chief Justice of India Justice D.Y. Chandrachud along with the members of his family offered prayers in Srinivasa Mangapuram temple on Wednesday evening. 

 

Earlier, on his arrival he was received by TTD Chairman Sri YV Subba Reddy and TTD EO (FAC) Sri Anil Kumar Singhal at the main entrance of the temple. Later he offered prayers to Dhwajasthambham had darshan of the presiding deity of Sri Kalyana Venkateswara Swamy.

 

After darshan, the temple Archakas rendered Vedaseervachanam and the Chief Justice of Apex Court was offered prasadams by the TTD Chairman and EO.

 

Later the CJI has also performed Gopuja to the cow and calf in the temple premises and fed the bovine with fodder.

 

District Judge Sri Veer Raju, CVSO Sri Narasimha Kishore, Additional SP Sri Kulasekhar, Spl Gr DyEO Smt Varalakshmi, VGO Sri Manohar and others were also present.

 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుపతి 28 డిసెంబరు 2022: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ జస్టిస్ చంద్ర చూడ్ కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్ర చూడ్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం సిజె ఐ కి చైర్మన్,ఈవో స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీ చంద్ర చూడ్ దంపతులు ఆలయంలో గోపూజలో పాల్గొన్నారు. గోవు, దూడకు పూజలు చేసి గ్రాసం తినిపించారు.

జిల్లా జడ్జి శ్రీ వీర్రాజు , టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఆర్డీవో శ్రీ కనక నరసారెడ్డి , డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి , విజివో శ్రీ మనోహర్, అదనపు ఎస్పీ శ్రీ కులశేఖర్, డిఎస్పీ శ్రీ నరసప్ప , ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పార్థ సారధి, శ్రీ బాలాజి రంగాచార్యులు ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ముని చంగలరాయులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.