CJI OFFERS PRAYERS IN TIRUCHANOOR TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
TIRUPATI, 10 JUNE 2022: The Honourable Chief Justice of India Justice NV Ramana offered prayers in Sri Padmavathi Ammavaru temple along with his family at Tiruchanoor on Friday.
Upon his arrival at the main entrance of the temple, he was accorded a traditional welcome by archakas and received by TTD EO Sri AV Dharma Reddy.
After darshan of Ammavaru he was offered Theertha Prasadams by EO.
Among other prominent persons District Judges Sri Bhima Rao, Sri Veerraju, local MLA Sri Karunakar Reddy, JEO Sri Veerabrahmam, RDO Sri Kanakanarasa Reddy, DyEO Sri Lokanatham, VGO Sri Manohar, Archaka Sri Babu Swamy were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
తిరుపతి, 2022 జూన్ 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకున్నసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్” ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి అమ్మవారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి వస్త్రం, తీర్థప్రసాదాలను ఈవో అందజేశారు.
జిల్లా న్యాయమూర్తులు శ్రీ భీమారావు, శ్రీ వీర్రాజు, తిరుపతి ఎమ్మెల్యే
శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆర్‌డివో శ్రీ కనక నరసారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ మనోహర్, అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.