CJI OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE ON HIS MAIDEN VISIT _ శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్

TIRUMALA, 29 DECEMBER 2022: On his maiden visit to Tirumala, the Honourable Chief Justice of India Justice D.Y. Chandrachud offered prayers to Sri Venkateswara Swamy and also in Sri Varaha Swamy temples along with his family members on Thursday.

Earlier, on his arrival at the temple Mahadwaram, he was received by TTD Chairman Sri YV Subba Reddy along with the TTD EO (FAC) Sri Anil Kumar Singhal followed by the traditional Istikaphal welcome amidst chanting of hymns and melam and led inside the temple for Darshan of Lord Venkateswara.

He was explained about the significance of the Mula Virat and the history of the temple by the temple priests inside the sanctum sanctorum. After the Darshan of Sri Venkateswara Swamy, he was offered Vedaseervachanam by Vedic Pundits at Ranganayakula Mandapam.

Later the Chairman presented the protocol dignitary with Theertha Prasadams and 2023 Calendars and Diaries of TTD along with the lamination photo of Lord Venkateswara that was prepared using Dry Flower Technology.

Additional EO(FAC) Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, Temple DyEO Sri Ramesh Babu, VGOs Sri Bali Reddy, Sri Giridhar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్

తిరుమల 29, డిసెంబరు 2022: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ గురువారం ఉద‌యం తొలిసారిగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని, శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డివై.చంద్రచూడ్ కు టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో(ఎఫ్ఏసి) శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు కలిసి సంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

గర్భాలయంలో స్వామివారి మహత్యాన్ని, ఆలయ చరిత్రను అర్చకులు వివరించారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించారు.

అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇత‌ర ప్రముఖులకు తీర్థప్రసాదాలు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన శ్రీవారి చిత్రపటం, 2023 టిటిడి క్యాలెండర్‌, డైరీలను చైర్మన్‌ అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఈవో(ఎఫ్ఏసి) శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.