ORNAMENTS DONATED _ తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు విరాళం

TIRUMALA, 29 DECEMBER 2022: Tirupati-Chittoor-based KVR jewellers has donated three varieties of ornaments to Tirumala temple on Thursday.

The founder and donor, Sri KR Narayanamurthy along with his spouse Smt Swarnagowri and family members handed over the ornaments to the TTD Trust Board Chairman Sri YV Subba Reddy and TTD EO(FAC) Sri Anil Kumar Singhal at Ranganayakula Mandapam.

According to the donor, the ornaments weighing about 1756gms are valued at around Rs.1.30crore comprising a pair of Bavaleelu(ear ornaments) for the Mula Virat, Golden Yagnopaveetham for Sri Malayappa Swamy, Three Pathakams studded with valuable stones to Sri Malayappa, Sridevi and Bhudevi. 

It may be mentioned here that the same donor during December last donated Kati and Varada Hastams to Srivaru worth about Rs.3crore.

TTD Trust Board member Sri Ashok Kumar, Temple DyEO Sri Ramesh Babu and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు విరాళం
 
తిరుమల, 29 డిసెంబరు, 2022: తిరుపతి, చిత్తూరులోని కెవిఆర్‌ జ్యూవెలర్స్‌ వ్యవస్థాపకులు శ్రీ కెఆర్‌.నారాయణమూర్తి, వారి సతీమణి శ్రీమతి కెఎన్‌.స్వర్ణగౌరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి గురువారం తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీవైవి.సుబ్బారెడ్డి, ఈవో(ఎఫ్‌ఏసి) శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌కు అందించారు. 
 
దాత అందించిన వివరాల మేరకు సుమారు 1756 గ్రాములు బరువుగల ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.1.30 కోట్లు. వీటిలో మూలవిరాట్‌ కోసం ఒక జత కర్ణాభరణాలు, శ్రీమలయప్ప స్వామివారికి యజ్ఞోపవీతం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి విలువైన రాళ్లు పొదిగిన మూడు పతకాలు ఉన్నాయి. 
 
కాగా, ఇదే దాత గతేడాది డిసెంబరులో సుమారు రూ.3 కోట్లు విలువైన కటి, వరద హస్తాలను శ్రీవారికి కానుకగా అందించారు. 
 
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్‌కుమార్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.