CJI RAMANA OFFERS PRAYERS AT TIRUCHANOOR TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

Tirupati,19, August 2022:  Supreme Court Chief Justice of India, Justice N V Ramana along with family members on Friday evening offered prayers at the Sri Padmavati temple, Tiruchanoor.

 

He was given a traditional Istikaphal welcome by the TTD EO Sri AV Dharma Reddy and JEO Sri Veerabrahmam along with temple Archakas.

 

The CJI family after saluting the Dwajasthambham had Sri Padmavati ammavari Darshan and were later rendered Veda Ashirvachanam by Vedic pundits.

 

Thereafter the TTD EO felicitated CJI with a shawl and also presented Ammavari thirtha Prasadam

 

Telangana high court CJ justice Ujjal Bhuyan, AP high court judges Justice AV Ravindra Babu, Justice Duppala Venkata Ramana, Justice Chakravarti Vijayalakshmi, Tirupati District incharge Justice Komgara Vijayalakshmi, Telangana high court judges Lalita Kamigeti, Chittoor District principal judge Justice Bhim Rao, Tirupati ADJ, Chief Protocol justice Veeraju and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుపతి 19 ఆగస్టు 2022: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు .

ఆలయం ఎదుట టీటీడీ ఈ ఓ శ్రీ ఎ వి ధర్మా రెడ్డి, జె ఈవో శ్రీ వీరబ్రహ్మం ,ఆలయ అర్చకులు జస్టిస్ ఎన్వీ రమణకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు . ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం ఆయన అమ్మవారి దర్శనం చేసుకున్నారు . అనంతరం పండితులు వేదాశీర్వచనం చేశారు .ఈవో శ్రీ ధర్మారెడ్డి శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏ వి రవీంద్రబాబు, జస్టిస్ దుప్పాల వెంకటరమణ, జస్టిస్ చక్రవర్తి విజయలక్ష్మి, తిరుపతి జిల్లా ఇంఛార్జి జస్టిస్ కొంగర విజయ లక్ష్మి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లలితా కనిగేటి, చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ భీమ్ రావు, తిరుపతి ఎడిజే, చీఫ్ ప్రోటోకాల్ జస్టిస్ వీర్రాజు తదితరులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంట ఉన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది