DEVOTEES IN TRANCE AS SRINIVASA BLESSED IN KALIYA MARDANA ALANKARAM OF SAHASRA DEEPALANKARA SEVA AT NELLORE VB FETE _ సహస్రదీపాలంకార సేవలో కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీనివాసుని కటాక్షం- భక్తుల తన్మయత్వం

Nellore,19, August 2022:  Devotees were in trance at the Sri Vaibhavotsavam fete as Srinivasa blessed them in Kaliya Mardana alankaram of Sahasra Deepalankara Seva at AC Subba Reddy stadium on Friday evening.

 

Earlier Veda pundits performed Chatur Veda parayanams followed by Annamaiah sankeetans and Purandara Dasa Keerthana by TTD Annamacharya project artist Smt Bhubaneswari, Sri Saraswati Prasad and Sri Kalyan Kumar. Later on Vadhya Niranjanam was also rendered with Mangala vadyam.

 

In the evening Swami rode on a Tiruchi around the Vedika and blessed devotees. Thereafter night kainkaryas we’re observed and Ekantha Seva is rendered.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సహస్రదీపాలంకార సేవలో కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీనివాసుని కటాక్షం- భక్తుల తన్మయత్వం

నెల్లూరు, 2022, ఆగస్టు 19: నెల్లూరులో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో నాల్గవ రోజైన శుక్రవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామివారి వైభవాన్ని దర్శించి తన్మయత్వం చెందారు. చల్లటి సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారు ఉల్లాసంగా ఊయలలో ఊగుతూ భక్తులకు కనువిందు చేశారు. నిత్యం అవిశ్రాంతంగా భక్తులకు దర్శనభాగ్యాన్ని ప్రసాదించే స్వామివారు సహస్రదీపాలంకార సేవతో సేద తీరుతారు.

ముందుగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఆ తరువాత టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి భువనేశ్వరి, శ్రీ సరస్వతీ ప్రసాద్, శ్రీ కళ్యాణ కుమార్ అన్నమయ్య సంకీర్తనలు, పురందరదాస కీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఇందులో ‘ తిరుపతి వెంకటరమణ….., బంధనేని రంగ బంధనేని, ముద్దుగారే యశోద…., అలరచంచలమైన ఆత్మలందుండనీ అలవాటుజేసెనీ ఉయ్యాల…,’ తదితర కీర్తనలున్నాయి. ఆ తరువాత మంగళవాయిద్యంతో వాద్యనీరాజనం సమర్పించారు.

సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వేదిక చుట్టూ స్వామివారు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు ఏకాంతసేవ జరుగనుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.