CLEANLINESS AND HYGIENE GIVEN TOP PRIORITY IN TIRUMALA: DY EO HEALTH _ శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో పారిశుద్ధ్యానికి పెద్ద పీట‌

45 toilets in the four Mada streets cleaned round the clock in three shifts

230 permanent and 149 temporary toilets serve nearly two lakh pilgrims daily

2,600 sanitation staff deployed, with 750 additional personnel for Brahmotsavam

60 food and drinking-water samples tested daily; 

Weekly cleaning drive held at fast-food centres

Tirumala, 13 October 2026: TTD has accorded top priority to sanitation during the Srivari Navaratri Brahmotsavam, with special measures being taken to maintain hygiene, particularly in public toilets, said TTD  Deputy EO for Health Sri Somannarayana.

Addressing the media at the Rambageecha Media Centre in Tirumala on Tuesday evening, he said sanitation staff are working in three shifts to keep the 45 toilets in the galleries of four Mada streets temple clean at all times.

He said Tirumala had 230 permanent and 149 temporary toilets, used by nearly two lakh pilgrims every day. 

Standard operating procedures are being strictly followed to ensure continuous cleanliness, he maintained.

Garbage accumulating in the Mada streets during vahana sevas are being cleared regularly and transported to the dumping yard through tippers, he said. Besides, there are 6000 dustbins in 3000 points to clear the garbage in entire Tirumala.

While 2,600 sanitation personnel were currently on duty, an additional 750 staff had been deployed for the Brahmotsavam.

The DyEO Health said feedback on toilet hygiene was being collected regularly through Srivari Sevaks, and their suggestions are being considered to further improve sanitation. “Over 98% of devotees expressed immense satisfaction at the hygiene and cleanliness being maintained in Tirumala “, he maintained.

On food safety, he said 60 food and drinking-water samples were being collected daily and sent to the laboratory for testing. 

A monthly cleaning day was also being observed every Tuesday at fast-food centres in Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో పారిశుద్ధ్యానికి పెద్ద పీట‌

టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమ‌న్నారాయ‌ణ‌

తిరుమ‌ల‌, 2026 అక్టోబ‌ర్ 13: శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో పారిశుద్ధ్యానికిపెద్ద‌పీట వేస్తూ మ‌రుగుదొడ్ల ప‌రిశుభ్ర‌త‌లో రాజీ లేకుండా ప్ర‌త్యేక చ‌ర్య‌లుతీసుకుంటున్న‌ట్లు టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమ‌న్నారాయ‌ణ తెలిపారు. తిరుమ‌ల‌లోని రామ్ భ‌గీచా-2 లోని మీడియా సెంట‌ర్ లో మంగ‌ళ‌వారంనిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

శ్రీ‌వారి ఆల‌య నాలుగు మాడ వీధుల్లో 45 మ‌రుగుదొడ్ల‌లో 3 షిఫ్టుల్లో సిబ్బందినిరంత‌రం శ్ర‌మిస్తూ మ‌రుగుదొడ్ల‌ను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నార‌నిచెప్పారు. తిరుమ‌ల‌లో శాశ్వ‌తంగా 230 మ‌రుగుదొడ్లు, 149 తాత్క‌లికమ‌రుగుదొడ్లు ఉన్నాయ‌ని, రోజుకు దాదాపు రెండు ల‌క్ష‌ల మంది భ‌క్తులు ఈమ‌రుగుదొడ్ల‌ను వినియోగిస్తార‌ని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ మ‌రుగుదొడ్ల‌నుప‌రిశుభ్రంగా ఉంచేందుకు స్టాండ‌ర్డ్ ఆప‌రేటివ్ ప్రొసీజ‌ర్ ను పాటిస్తూఅనునిత్యం శుభ్రంగా ఉంచేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని చెప్పారు.

అదేవిధంగా వాహ‌న సేవ‌ల స‌మ‌యంలో మాడ వీధుల్లో పేరుకునే చెత్త‌నుఎప్ప‌టిక‌ప్పుడు టిప్ప‌ర్ల ద్వారా డంపింగ్ యార్డుకు త‌ర‌లిస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో 2600 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవ‌లుఅందిస్తున్నార‌ని, బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా అద‌నంగా అద‌నంగా 750 మంది సిబ్బంది త‌మ సేవ‌లు అందిస్తున్నార‌ని చెప్పారు.

శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా మ‌రుగుదొడ్ల ప‌రిశుభ్ర‌త‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అభిప్రాయాలుసేక‌రించి, వారి స‌లహాలు, సూచ‌న‌లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని మ‌రింతప‌రిశుభ్ర‌త పాటించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని చెప్పారు.

తిరుమ‌ల‌లో ఆహార భ‌ద్ర‌త‌కు పెద్ద పీట వేస్తూ రోజుకు ఆహారం, తాగునీటిని50 శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి మంగ‌ళ‌వారం తిరుమ‌ల‌లోని ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో మాస క్లీనింగ్ డే నుఅమ‌లు చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సీపీఆర్వో డాక్ట‌ర్ టి.ర‌వి, పీఆర్వో కుమారి నీలిమపాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.