SRI MAHALAKSHMI DEEPA PUJA IN KUPPAM ON OCTOBER 20 _ కుప్పంలో అక్టోబరు 20న శ్రీ మహాలక్ష్మీ దీపపూజ

JEO Dr. A. SHARATH REVIEWS ARRANGEMENTS

Tirupati, October 13, 2026: TTD JEO Dr. A. Sharath directed officials to make elaborate arrangements for Sri Mahalakshmi Deepa Puja, scheduled at 4 PM on October 20 at the Sri Mahalakshmi Deepotsavam venue near Kuppam tank bund, Vilajapuram Road, Kuppam. He inspected the arrangements on Tuesday evening and reviewed the facilities for devotees.

He instructed officials to provide sheds, mats, lamps and puja materials, LED screens, drinking water, sanitation facilities and temporary toilets. Arrangements should also be made for the distribution of buttermilk and Annaprasadam to devotees arriving from Kuppam constituency and nearby areas.

He stressed the need for proper security and coordination among the police, municipal authorities and TTD departments to ensure that devotees participate in the puja in a peaceful spiritual atmosphere. He directed officials to complete all arrangements on time.

MLC Sri Srikanth, TTD Board Member Sri Shantaram, CE Sri Manoharam, SE Sri Venkateswarlu, VGO Sri Giridhar, Additional Health Officer Dr. Sunil, EE Sri Mallikarjuna Prasad, DE (Electrical) Smt. Saraswathi, AVSO Sri Krishnamurthy, SVBC CPO Sri Sri, police and municipal officials, and others participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

కుప్పంలో అక్టోబరు 20న శ్రీ మహాలక్ష్మీ దీపపూజ

భక్తులకు పటిష్ట ఏర్పాట్లు : టీటీడీ జేఈవో డా. ఎ. శరత్

తిరుపతి, అక్టోబరు 13, 2026: కుప్పం విలజాపురం రోడ్డు, చెరువు కట్ట సమీపంలోని శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవ ప్రాంగణంలో అక్టోబరు 20న సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీ దీపపూజకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా భక్తుల కోసం షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, ఎల్‌ఈడీ స్క్రీన్లు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంతో పాటు సమీప ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు  మజ్జిగ, అన్నప్రసాదం పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

భక్తులు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో దీపపూజలో పాల్గొనేలా చూడాలని, భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పోలీసు, మున్సిపల్‌, టీటీడీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పూజకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీప పూజకు జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ శ్రీకాంత్‌, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారం, సీఈ శ్రీ మనోహరం, ఎస్ ఈ శ్రీ వేంకటేశ్వర్లు, విజీఓ శ్రీ గిరిధర్‌, అదనపు ఆరోగ్య శాఖ అధికారి డా. సునీల్‌, ఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్, డీఈ (ఎలక్ట్రికల్‌) శ్రీమతి సరస్వతి, ఏవీఎస్వో శ్రీ కృష్ణమూర్తి, ఎస్‌వీబీసీ సీపీఓ శ్రీ శ్రీ, పలువురు పోలీసు అధికారులు, మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి విడుదల చేసినది.