CM OF HIMACHAL PRADESH OFFERS PRAYERS TO LORD VENKATESWARA _ శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ.శ్రీ జైరాం ఠాకూర్
TIRUMALA, 16 Feb. 22: The Hon’ble CM of Himachal Pradesh Shri Jai Ram Thakur accompanied by the family had blessings of Lord Venkateswara in Tirumala Srivari Temple on Wednesday morning.
On his arrival at Sri Vari Temple, the priests and officials have welcomed the Hon’ble Chief Minister and led to the sanctum sanctorium. After the darshan of the lord, the temple priests have rendered Vedasirvachanm to the CM and his entourage at Ranganayakula Mandapam.
TD Chairman and EO presented Thirtha Prasadams, Calendar, Diary and Coffee Table book to the dignitary.
DyEOs Sri Ramesh, Sri Lokanadham and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ.శ్రీ జైరాం ఠాకూర్
తిరుమల, 2022 ఫిబ్రవరి 16: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ. శ్రీ జైరాం ఠాకూర్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
శ్రీవారి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డిలు శ్రీవారి తీర్థప్రసాదాలు, క్యాలెండర్, డైరీ, కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆయనకు అందజేశారు.
డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, అగరబత్తీలు, పంచగవ్య ఉత్పత్తులు మరియు ఆరు షీట్ల క్యాలెండర్‌తో తయారు చేసిన లామినేట్ చేసిన దేవత ఫోటోను ఈవో అందజేస్తూ, వాటి తయారీ మరియు ప్రాముఖ్యత గురించి గౌ.ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వేంపల్లి శ్రీనివాసులు, డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీ లోకనాధం తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.