PM BRAVERY AWARD WINNER GIRL MEETS TTD CHAIRMAN _ టీటీడీ చైర్మన్ ను కలసిన ప్రధానమంత్రి సాహస అవార్డు సాధించిన బాలిక
Tirumala, 16 February 2022: The brave girl, Gurugu Hima Priya who saved her parents and 2 sisters during a terrorist attack on their army quarters in Jammu & Kashmir called on TTD Chairman Sri YV Subba Reddy on Wednesday morning at the latter’s camp office in Tirumala.
The TTD Chairman lauded the brave girl who won the prestigious PM Bravery Award for her act of bravery. The parents of the girl Sri Satyanarayana, Smt Padmavati, and her sisters also met him.
The incident occurred in 2018 when Hima Priya hailing from Ponnam village in Srikakulam district was just eight years old and Prime Minister had announced the Bala Puraskar award in 2022. The award was presented virtually by PM Sri Narendra Modiji through the Srikakulam District Collector Office on January 24.
TTD Chairman who interacted with them expressed happiness and praised the brave act of Hima Priya. Her father Sri Satyanarayana is presently working as Army Havaldar at Pune.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
Text content
Text content
Text content
టీటీడీ చైర్మన్ ను కలసిన ప్రధానమంత్రి సాహస అవార్డు సాధించిన బాలిక
తిరుమల 16 ఫిబ్రవరి 2022: జమ్మూకాశ్మీర్ లోని ఆర్మీ క్వార్టర్స్ లోని తమ ఇంటిమీద ఉగ్రవాదులు చేసిన దాడి నుంచి తల్లి, చెల్లెళ్లను సాహసోపేతంగా కాపాడి ప్రధానమంత్రి సాహస బాలిక అవార్డు పొందిన గురుగు హిమ ప్రియ బుధవారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ని కలిశారు. తన తల్లిదండ్రులుసత్యనారాయణ, పద్మావతి, తన ఇద్దరు చెల్లెళ్ళతో పాటు క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ ను కలిశారు.
2018 లో హిమప్రియ ఎనిమిదేళ్ళ వయస్సు లో ఉండగా ఈ సంఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామానికి చెందిన ఈ బాలిక ధైర్య సాహసానికి మెచ్చి 2022వ సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 24 వ తేదీ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ద్వారా హిమ ప్రియ ఈ అవార్డు అందుకున్నారు. ఈ వివరాలు తెలుసుకున్న చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి బాలికను ఆమె తల్లిదండ్రులను అభినందించారు. బాలిక తండ్రి శ్రీ సత్యనారాయణ ప్రస్తుతం పూణె లో ఆర్మీ హవాల్దార్ గా పని చేస్తున్నారు
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది