CM OFFERS PRAYERS IN TIRUMALA _ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు

TIRUMALA, 19 SEPTEMBER 2023: The Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on Tuesday offered prayers in the Hill shrine of Sri Venkateswara Swamy at Tirumala.

Earlier on his arrival at Mahadwaram he was welcomed traditionally with Isthikaphal and taken inside the temple amidst Vedic chants and mangalavaidyams.

After offering prayers he was offered Vedasirvachanam at Ranganayakula Mandapam and presented with Swamivari Theerthaprasadams by the TTD Chairman Sri Karunakara Reddy.

Deputy CM Sri Narayana Swamy, Ministers Sri Ramachandra Reddy, Smt Roja, TTD EO Sri AV Dharma Reddy and other state and district public representatives, authorities were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు

తిరుమల, 2023 సెప్టెంబరు 19: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న గౌ. ముఖ్యమంత్రివర్యులకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రివర్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి శ్రీ‌వారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, ముఖ్యమంత్రివర్యులకు అందించారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీమతి రోజా, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.