DWARAKA KRISHNA ON CHINNASESHA VAHANAM _ చిన్నశేష వాహనంపై ద్వార‌క కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

TIRUMALA, 19 SEPTEMBER 2023 Sri Malayappa Swamy decked as Dwaraka Krishna blessed His devotees on the second day morning of the ongoing annual Brahmotsavams in Tirumala.

BOOKS RELEASED

Three spiritual books including Sri Venkateswara Swamy Varu by Archakam Sri Ramakrishna Deekshitulu, Sri Venkateswara Sachitra Suprabhatam in Telugu and Kannada, Hindumata Puranangalil Needikathaigal in Tamil were released in front of the Chinna Sesha Vahanam by TTD EO Sri AV Dharma Reddy.

TTD Chairman Sri B Karunakara Reddy,One of the Chief Priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, SE2 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Lokanatham, Annamacharya Project Director Dr Vibhishana Sharma and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

చిన్నశేష వాహనంపై ద్వార‌క కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమల, 19 సెప్టెంబ‌రు 2023: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వార‌క కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు

చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.