CM TO OFFER SILK VASTRAMS FOR SITA RAMA KALYANAM-TIRUPATI JEO_ శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో

Vontimitta, 29 March 2018: As the most important event of Sri Sita Rama Kalyanam is going to take place at Vontimitta in YSR Kadapa district on Friday, Tirupati JEO Sri P Bhaskar along with District Collector Sri Babu Rao Naidu and SP Sri Bapuji Attada inspected the site on Thursday.

Speaking to media he said, the Honourable CM of AP Sri N Chandrababu Naidu will present the silk vastrams on behalf of state government for the celestial marriage. “The state head carries the Talambralu over his head and reaches the venue tomorrow and takes part in this state festival”, he added.

All the arrangements for the big fete is already completed. Meanwhile the SP briefed media on traffic regulations in place on Friday in wake of the celestial event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో

మార్చి 29, ఒంటిమిట్ట, 2018: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 30వ తేదీ శుక్రవారం జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను టిటిడి తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌ గురువారం కడప జిల్లా కలెక్టర్‌ శ్రీటి.బాబురావు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి, కడప ఎస్పీ శ్రీఅట్టాడ బాబుజితో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఒంటిమిట్ట రాములవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణం ఎంతో ముఖ్యమైనదని, దీనిని రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారంనాడు వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు సమర్పించనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించామని, భద్రతా ఏర్పాట్లకు తగ్గట్టు ఇంజినీరింగ్‌ పనులు చేపడుతున్నామని తెలిపారు. భక్తులందరూ కల్యాణానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

కడప కలెక్టర్‌ శ్రీటి.బాబురావు నాయుడు మీడియాతో మాట్లాడుతూ భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సంతృప్తికరంగా కల్యాణాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు. భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వేరు వేరు ద్వారాలు ఏర్పాటుచేసినట్టు చెప్పారు.

కడప ఎస్పీ శ్రీఅట్టాడ బాబుజి మీడియాతో మాట్లాడుతూ కల్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తుల కోసం దాదాపు 3 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా వాహనాలు దారి మళ్లించామన్నారు. కార్గో వాహనాలు ఒంటిమిట్టవైపు రాకుండా రాయచోటివైపు దారి మళ్లించినట్టు చెప్పారు. ఒంటిమిట్ట నుండి రాజంపేట వైపు, ఒంటిమిట్ట నుండి కడప వైపు కలిపి మొత్తం 12 వేల వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేపట్టామన్నారు.

ఈ కార్యక్రమంలో రాజంపేట ఆర్‌డిఓ శ్రీ వీరబ్రహ్మం, టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి, ఏఈవో శ్రీ రామరాజు, ఇఇ శ్రీకృష్ణారెడ్డి, డిఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.