TUMBURU TEERTHAM ARRANGEMENTS IN PLACE_ మార్చి 31న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి

Tirumala, 29 March 2018: As Tumburu Teertha Mukkoti falls on March 31, TTD has made elaborate arrangements for this torrent festival.

TTD has made anna prasadam and water distribution facilities for the sake of pilgrims who trek the tedious path to teertham on the auspicious day.

Elaborate security arrangements with TTD security and police sleuths have also been made.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 31న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి

మార్చి 29, తిరుమల 2018: తిరుమలలో ప్రముఖ పుణ్యతీర్థమగు శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవాన్ని ఈ నెల 31వ తేది శనివారం ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.

అందులో భాగంగా మార్చి 30వ తేదీ ఉదయం నుండి తుంబురు తీర్థ ముక్కోటికి భక్తులను అనుమతించనున్నారు. భక్తుల కొరకు రెండు లక్షల తాగునీరు ప్యాకెట్లు, 50 వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో మార్చి 30వ తేది ఉదయం 10.00 గంటల నుండి భక్తులకు పులిహోరా, పెరుగన్నం ప్యాకెట్లు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇంజినీంగ్‌ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, త్రాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారు. పోలీసుశాఖ, అటవీశాఖ మరియు టిటిడి విజిలెన్స్‌ సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో
ఉండేందుకు వీలుగా రెండు అంబులెన్స్‌లను, పారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు.

పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నవని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదములు కలిగించేవి, ప్రధానమైనవి 7 తీర్థములు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్థములు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరించిన యెడల సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరునని పురాణ వైశిష్ట్యం.

పాల్గుణమాసమున ఉత్తరఫల్గుణీ నక్షత్రముతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.