CO-ORDINATED ACTION BY SVBC AND PROJECTS FOR EXTENDED DHARMIC CAMPAIGN- TTD ADDL EO _ ధార్మిక ప్రాజెక్టులు, ఎస్వీబీసీ స‌మ‌న్వ‌యంతో మ‌రింత విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చారం : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirupati, 12 Mar. 21: All the Dharmic Projects of TTD and SVBC should coordinate their activities for extended Hindu Sanatana Dharma propagation, said TTD Additional Executive Officer, Sri AV Dharma Reddy.

Chairing the first review meeting of the activities of all Dharmic Projects of TTD and SVBC at the SVBC new building office he said the maiden meeting was after he assumed charges as In charge of all projects of TTD in addition to MD of SVBC.

The Additional EO said the Dharmic projects should take up extended campaigns by coordinating efforts with the SVBC and also the projects in vice Versa popularise the SVBC programs.

He said the SVBC was already operating Telugu and Tamil Channels and soon to launch the Kannada and Hindi channels.

He said the Alwar Divya Prabandha Project should support the Tamil channel, while the Dasa Sahitya Project would provide material to the Kannada channel and the National Sanskrit University to the Hindi channel.

In the district level dharmic programs, the HDPP staff, TTD Kalyana Mandapam managers and local supporters from Mutts, Peethams, like-minded dharmic institutions, and Gow Sanghas, ISCKON, Srivari Sevakulu and Bhajan Mandal members should support all these activities.

He said on the basis of monthly programs of the Dharmic Projects, a future action plan has to be drawn up and every month he will review the progress of the activities of all projects and SVBC.

SVBC CEO Sri G Suresh Kumar, Dasa Sahitya Project Special Officer Sri Anandathirthacharyulu, Annamacharya project Director Sri Dakshinamurthy, Special Officer of Kalyanotsavam Project Sri Satya Gopal SV College of Music and Dance Principal Dr Jamuna Rani, Sapthagiri editor Dr VG Chokkalingam, OSD of SV Vedic higher studies institute Dr A.Vibhishana Sharma, Epic Studies Supervisor Sri Hemanth Kumar were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధార్మిక ప్రాజెక్టులు, ఎస్వీబీసీ స‌మ‌న్వ‌యంతో మ‌రింత విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చారం : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుపతి, 2021 మార్చి 12: టిటిడిలోని ధార్మిక ప్రాజెక్టులు, ఎస్వీబీసీ స‌మ‌న్వయంతో మ‌రింత విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వెల్ల‌డించారు. టిటిడి ప్రాజెక్టుల పాల‌నా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం అద‌న‌పు ఈవో తిరుప‌తిలోని ఎస్వీబీసీ కార్యాల‌యంలో శుక్ర‌వారం అధికారుల‌తో తొలి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌తి నెలా ప్రాజెక్టుల కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష చేప‌ట్టి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌ని వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ప్రాజెక్టుల ద్వారా నిర్వ‌హించే ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ఎస్వీబీసీ స‌హ‌కారంతో జ‌న‌బాహుళ్యంలోకి తీసుకెళ్లాల‌న్నారు. అలాగే ఎస్వీబీసీ ద్వారా ప్ర‌సారమ‌య్యే కార్య‌క్ర‌మాల‌కు ప్రాజెక్టులు త‌మ వంతు స‌హ‌కారం అందించాల‌ని సూచించారు. ఎస్వీబీసీలో తెలుగుతో పాటు త‌మిళ ఛాన‌ల్‌లో ప్ర‌సారాలు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లో క‌న్న‌డ, హిందీ ఛాన‌ళ్లు ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ఆళ్వార్ దివ్యప్ర‌బంధ ప్రాజెక్టు ద్వారా త‌మిళ ఛాన‌ల్‌కు, దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా క‌న్న‌డ ఛాన‌ల్‌కు, తిరుప‌తిలోని జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ద్వారా హిందీ ఛాన‌ల్‌కు స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌న్నారు. జిల్లా కేంద్రాల్లో నిర్వ‌హించే ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ సిబ్బంది, క‌ల్యాణ మండ‌పాల మేనేజ‌ర్లు, ప్రాజెక్టులకు అనుబంధంగా ఉన్నవారితోపాటు స్థానికంగా ఉండే మ‌ఠాలు, పీఠాలు, ధార్మిక సంస్థ‌లు, గోసంఘాలు, ఇస్కాన్, శ్రీ‌వారి సేవ‌కులు, భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యుల‌ స‌హ‌కారం తీసుకోవాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సీఈవో శ్రీ జి.సురేష్‌కుమార్‌, దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్యులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి, క‌ల్యాణోత్స‌వం ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆర్ఎస్‌.గోపాల్‌, ఎస్వీ సంగీత క‌ళాశాల ప్రిన్సిపాల్ శ్రీ‌మ‌తి జ‌మునారాణి, స‌ప్త‌గిరి ఎడిట‌ర్ డా. విజి.చొక్క‌లింగం, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, ధార్మిక ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ హేమంత్‌కుమార్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.