COCONUT HALFS TENDER CUM AUCTION ON JULY 13_ జూలై 13న శ్రీ కపిలేశ్వరాలయంలో కొబ్బరిచిప్పల సేకరణకు టెండర్‌ కమ్‌ వేలం

Tirupati, 04 Jul 18 : The TTD is going for the tender cum auction for lifting Coconut halfs for the period of 2018, July 27 to 2019, July 26 on July 13.

This tender cum auction takes place in the office of DyEO which located at Purandaradasa complex in Tirupati. Interested can pay Rs.25,000 as EMD. They can get the tender forms by paying Rs.500 DD.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జూలై 13న శ్రీ కపిలేశ్వరాలయంలో కొబ్బరిచిప్పల సేకరణకు టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2018 జూలై 04: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో గల శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో 2018, జూలై 27 నుండి 2019, జూలై 26వ తేదీ వరకు కొబ్బరిచిప్పల సేకరణకు గాను జూలై 13వ తేదీన టెండర్‌ కమ్‌ బహిరంగ వేలం జరుగనుంది.

తిరుపతి, ప్రకాశం రోడ్డులోని పురందరదాస కాంప్లెక్స్‌లోగల ఆలయ డెప్యూటీ ఈవో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు టెండర్‌ కమ్‌ బహిరంగ వేలం నిర్వహిస్తారు. ”ఈవో, టిటిడి” పేరిట రూ.500/- డిడి తీసి టెండరు పత్రాలు పొందవచ్చు. వేలంలో పాల్గొనదలిచిన వారు రూ.25 వేలు ఇఎండిగా చెల్లించాల్సి ఉంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.