NEW LOOK TO MUSEUM TO ATTRACT MORE PILGRIMS-EO_ ఎస్వీ మ్యూజియాన్ని మరింత ఎక్కువ మంది భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింగాల్‌

Tirumala, 3 July 2018: Sri Venkateswara Museum in Tirumala is set to get a complete new look in the next two years, said TTD EO Sri Anil Kumar Singhal.

The EO who inspected the museum on Tuesday evening later held review meeting with Chief Museum Officer Dr PV Ranganayakulu and Engineering Officials.

Later speaking to media persons he said, the SV Museum is being visited by thousands of Pilgrims every day. With the introduction of Slotted Sarva Darshan, the number of visitors enhanced. We have contemplated to give a better look to the museum in the next couple of years.

The EO said, a few years ago, the National Institute of Designs has given a master plan to develop museum. But due to some reasons, it was not taken up that time and now we are planning for the overhauling of Museum to make it more visitors friendly”, he added.

The EO said, an Auditorium was also proposed and Rs.1crore was sanctioned for its development. We have also discussed on how to display the artifacts including Musical instruments, weapons statues, scriptures, copper plates, coins etc.

There are 16 to 17 halls with different displays. The officers concerned were instructed to take one hall every two months for overall development. Like wise in the next two years, the museum will be developed in a fulfledged manner to display the rare artifacts in an appealing manner”, he maintained.

In-charge CVSO Sri Siva Kumar Reddy, SE 2 Sri Ramachandra Reddy, SE Electrical Sri Venkateswarulu, VGO Sri Ravindra Reddy, Health Officer Dr Sermista were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ మ్యూజియాన్ని మరింత ఎక్కువ మంది భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింగాల్‌

జూలై 03, తిరుమల 2018: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియాన్ని మరింత ఎక్కువమంది భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని టిటిడి ఈవో, సీనియర్‌ అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని సందర్శనీయ ప్రాంతాలతో పాటు మ్యూజియాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. టిటిడి సీనియర్‌ అధికారులు ఎన్‌.ఐ.డి.వారి సహకారంతో మ్యూజియం అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ తయారు చేసినట్లు వివరించారు.

మ్యూజియంలోని వివిధ దేవతా మూర్తుల పంచలోహ విగ్రహాలు, రాతి విగ్రహాలు, పురాతన నాణేలు, అన్నమయ్య సంకీర్తనల రాగి రేకులు, శ్రీవారికి ఉపయోగించిన వాహనాలు, పూజ సామగ్రిని వివిధ గ్యాలరీలు ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకునే విధంగా రూపొందించనున్నట్లు తెలియచేశారు. ఇందుకు సంబంధించి అయారంగాలలో నిపుణుల సలహాలు, సూచనలతో అవసరమైన అద్దాలు, భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. శ్రీవారి ఆలయ చరిత్ర, శ్రీ పద్మావతి పరిణయం తదితర అంశాలతో పాటు తిరుమలలో శ్రీవారి ఉత్సవాలు, భక్తులకు అవసరమైన ఇతర సమాచారం పొందుపర్చనున్నామన్నారు.

అదేవిధంగా ఆడిటోరియంలో మరమ్మతులనుపూర్తిచేసి ఎక్కువ మంది భక్తులు కూర్చొని తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని, శ్రీవారి వైభవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేపడతున్నామని వివరించారు. రాబోవు 3 నెలల్లో మ్యూజియం అధికారి ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఒక గ్యాలరీని రూపొందించి, దానిపై భక్తుల నుండి అభిప్రాయాలు సేకరించి, ప్రతి రెండు నెలలకు ఒక గ్యాలరీ వంతున దాదాపు 17 గ్యాలరీలను నిర్మించనున్నట్లు తెలిపారు.

అంతకుముందు ఈవో అధికారులతో కలిసి మ్యూజియంలోని వివిధ గ్యాలరీలలో ఏర్పాటు చేసిన శ్రీవారి ఆలయం స్థలపురాణం, పుణ్యతీర్థాలు, అన్నమయ్య రాగిరేకులు, వివిధ ఆకృతుల్లో ఉన్న శిల్పాలు, ప్రాచీన చిత్రలేఖనం, వేలాది సంవత్సరాల చరిత్ర గల బంగారు నాణేలు, వెండి నాణేలు, ఇతర పురాతన చారిత్రాక ప్రాధాన్యం గల కళాకృతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. మ్యూజియంలోని గ్యాలరీలలో భక్తులను ఆకర్షించేలా విద్యుద్దీపాలంకరణ, తాగునీరు, సీలింగ్‌ మరమత్తు పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఇన్‌చార్జ్‌ సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ శ్రీరామచంద్రారెడ్డి, ఎస్‌ఇ శ్రీ వేంకటేశ్వర్లు, ఆరోగ్య విభాగం అధికారి డా|| శర్మిష్ఠ, మ్యూజియం అధికారి శ్రీపి.వి.రంగనాయకులు, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.