COMMENCE ANNUAL BRAHMOTSAVAMS WORKS – TTD EO TO OFFICERS_ శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు తిరుమల, తిరుపతిలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టండి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

TIrupati, 17 July, 2017: With a little more than two months left for the annual mega religious event, Sri Venkateswara Swamy brahmotsavams at Tirumala which is scheduled to commence in the last week of September this year, TTD EO Sri Anil Kumar Singhal directed the officers to commence the works for the same.

Reviewing in his chambers in TTD administrative building in Tirupati on Monday, the EO along with JEOs Sri KS Sreenivasa Raju and Sri P Bhaskar, the EO said in the wake of ensuing brahmotsavams the parking areas are to be identified at Tirumala and Tirupati keeping in view the scores of pilgrims who throng from different places for Garuda Seva. “A team comprising both JEOs, CVSO and CE shall visit to identify the appropriate parking place at Bhavan’s school in Tirupati and Kakulakonda area in Tirumala”, he said.

The EO also instructed the concerned to give a new look to Tirumala temple by giving LED lighting inside and outside the temple. He instructed the Engineering wing to complete the pending civil works in Kapileswara Swamy temple in Tirupati by August end. “Also complete the Ratha Mandapam works by August 15 and shift the wooden chariot from the present place in Tiruchanoor”, he added.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO A Ravikrishna, CE Sri Chandrasekhar Reddy, Additional FACAO Sri Balaji were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు తిరుమల, తిరుపతిలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టండి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2017 జూలై 17: తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తులకు వాహనాలు పార్కింగ్‌ చేసుకునేందుకు ఇబ్బందులు లేకుండా తిరుమల, తిరుపతిలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల కార్యాలయంలో ఈవో సోమవారం సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుపతిలోని అలిపిరి, భారతీయ విద్యాభవన్‌ పాఠశాల మైదానం, తిరుమలలోని కాకులకొండ రోడ్‌ ప్రాంతంలో వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఇందుకోసం తిరుమల జెఈవో, తిరుపతి జెఈవో, సివిఎస్‌వో, చీఫ్‌ ఇంజినీర్‌ కమిటీగా ఏర్పడి 15 రోజుల్లోగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. బ్రహ్మూెత్సవాల్లో గరుడసేవ నాడు భక్తులు గ్యాలరీల్లోకి ప్రవేశించే మార్గాలను ఇప్పటినుంచే అధికారులు తనిఖీ చేసి తోపులాటలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వారం రోజుల లోపు టెలిఫోన్‌ బాక్సులను, గోడ గడియారాలను ఏర్పాటుచేయాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం, ఇతర ప్రాంతాల్లో అవసరమైన ఎల్‌ఇడి విద్యుద్దీపాలను వెంటనే ఏర్పాటుచేసి ఆధ్యాత్మికశోభను చేకూర్చాలని ఆదేశించారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథమండపం వద్ద జరుగుతున్న సివిల్‌ పనులను ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. తిరుమలలో పూర్తిస్థాయిలో ఉద్యానవనాలు అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని డిఎఫ్‌ఓకు సూచించారు. టిటిడి కాల్‌సెంటర్‌లో భక్తులకు మరింత మెరుగ్గా సమాచారం అందించేందుకు సిబ్బందితో సమీక్ష నిర్వహించాలని తిరుపతి జెఈవోను ఆదేశించారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీఓ.బాలాజి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.