TTD ISSUES 20 THOUSAND TOKENS IN IT’S TWIN FOOT PATH ROUTES_ రెండు నడక మార్గాల్లో కలిపి భక్తులకు 20 వేల టోకెన్లు జారీ : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 17 July 2017: To avoid long waiting hours in the queue lines and to provide better darshan to pedestrian pilgrims within two and a half hours, the temple management of TTD has decided to issue 20 thousand tokens in footpath routes henceforth every day from Monday on wards including the weekends, said TTD EO Sri Anil Kumar Singhal.

Briefing some of the media persons in his chambers in TTD Administrative Building in Tirupati on Monday, TTD EO Sri AK Singhal elaborated that on Monday,14 thousands tokens were issued at Alipiri and six thousand tokens in Srivari Mettu footpath route. “Hence forth the same number of tokens will be issued every day including Fridays, Saturdays and Sundays in both the footpath routes”, he added.

Adding further the TTD EO said, “Providing hassle free darshan, accommodation and other facilities to multitude of visiting pilgrims is our top priority. The new token system for the allotment of accommodation at CRO is also one such pilgrim initiatives taken in the recent times. It is also garnering positive response from pilgrims as they are expressing their pleasure”, the EO asserted.

Meanwhile on Monday, the new system of issuing 20 thousand tokens on a day to footpath route pilgrims commenced at Alipiri and Srivari Mettu routes. The token issuing counters were closed in Alipiri at around 4pm while in Srivari Mettu at around 5:30pm as soon as the ceiling limit for the day is reached.

The pilgrims also expressed immense happiness with the new system as they had darshan of Lord Venkateswara within two-and-a-half hours as announced by TTD, facilitating them to avoid long waiting hours in queue lines for darshan.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

రెండు నడక మార్గాల్లో కలిపి భక్తులకు 20 వేల టోకెన్లు జారీ : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2017 జూలై 17: కాలినడక భక్తులు ఎక్కువసేపు క్యూలైన్లలో వేచి ఉండకుండా, రెండున్నర గంటల్లోపు మెరుగైన శ్రీవారి దర్శనం కల్పించేందుకు సోమవారం నుండి ప్రతిరోజూ రెండు నడకమార్గాల్లో కలిపి 20 వేల టోకెన్లు జారీ చేస్తున్నట్టు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ శుక్ర, శని, ఆదివారాలతోపాటు ఇకపై ప్రతిరోజూ ఈ మేరకు టోకెన్లు జారీ చేస్తామన్నారు. మొత్తం 20 వేల టోకెన్లలో సోమవారం అలిపిరి మార్గంలో 14 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లు జారీ చేసినట్టు తెలిపారు. భక్తులకు సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం, వసతి ఇతర సౌకర్యాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. భక్తుల సౌకర్యార్థం ఇటీవల తిరుమలలో గదులు పొందేందుకు టోకెన్ల మంజూరు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.

కాగా, అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో సోమవారం టోకెన్ల జారీ నూతన విధానం ప్రారంభమైంది. అలిపిరి వద్దగల టోకెన్‌ జారీ కౌంటర్‌ను సాయంత్రం 4.30 గంటలకు, శ్రీవారి మెట్టు వద్ద గల టోకెన్‌ జారీ కౌంటర్‌ను సాయంత్రం 5.30 గంటలకు టోకెన్లు జారీ ప్రక్రియ పూర్తయింది.

నూతనంగా ప్రవేశపెట్టిన టోకెన్ల జారీ విధానం ద్వారా రెండున్నర గంటల్లోపు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టిటిడి చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.