COMMON MAN FOCUS ON V- DAY DARSHAN- JEO TML _ సర్వదర్శనం భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠద్వార దర్శన ఏర్పాట్లు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 28 December, 2017: The JEO Tml Sri KS Sreenivas Raju said that the devotees were given an option to enter the Vaikunta dwaram after Srivari Darshanam on the holy days of the Vaikunta Ekadasi Dwadasi .Speaking to media he said devotees were already gathering in the VQC complex and other queue lines and could get darshan only after30 hours.They all will be allowed inside the temple for darshan only after 7.AM on Friday. In view of the Abhisekam on Friday, even VIPs will be allowed darshan after 5.00- 5.30 AM.

After accommodating nearly 22,000 devotees in the VQC other queue lines of 11000 in Alwar tank, and 24,000 in Narayanagiri gardens are also allowed later 2.3 km of guidelines will be filled up later.The darshan will be provided first for those in VQC and later those in the Alwar Tank and Narayanagiri queue lines after lunch hours.By then all those waiting in the 2.3 km of new queue lines will be let into Narayanagiri queue lines.

He said the 24-hour waiting is mandatory only on Vaikuntha Ekadasi day and the TTD has made all arrangements for lighting, toilets, drinking water, snacks, first aid and dispensaries and food inside all the queue lines.

The JEO said that TTD had taken a conscious decision to not issue any tickets at the JEO office and all those VIPs should go to centers allocated for their tickets delivery and that the VIP darshan hours have also been reduced to a great extent.

He said adequate security arrangements with 1500 police and vigilance staff and CC cameras are also made to ensure untoward incidents on Vaikunta Ekadasi.The entire TTD staff is roped in to serve the devotees in queue lines and provide them .


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI

సర్వదర్శనం భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠద్వార దర్శన ఏర్పాట్లు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

డిసెంబరు 28, తిరుమల 2017 ; వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సర్వదర్శనం భక్తులకు సంతృప్తికరంగా శ్రీవారి దర్శనంతోపాటు వైకుంఠద్వార ప్రవేశం కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టామని టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. వైకుంఠ ఏకాదశి శుక్రవారం నాటి శ్రీవారి దర్శనానికి గురువారం వేకువజామున 00.00 గంటలకు జెఈవో ప్రత్యక్ష పర్యవేక్షణలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోకి భక్తులను అనుమతించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్రస్తుతం కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశించిన భక్తులు 30 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తుందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి శుక్రవారం రావడంతో శ్రీవారికి అభిషేకాది కైంకర్యాలు, ధనుర్మాస పూజల కారణంగా ఉదయం 5 నుంచి 5.30 గంటల మధ్య విఐపిలకు దర్శనం ప్రారంభమవుతుందని, ఉదయం 8 నుంచి 8.30 గంటల మధ్య సర్వదర్శనం ప్రారంభిస్తామని వివరించారు. కంపార్ట్‌మెంట్లలో 22 వేల మంది, ఎటిసి క్యూలైన్లలో 11 వేల మంది, నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లలో 24 వేల మంది భక్తులు వేచి ఉండే అవకాశముందన్నారు. మొత్తం 2.3 కి.మీ మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉంటారని చెప్పారు. కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానుసారం అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తామని, మరుగుదొడ్ల వసతి, వైద్యసౌకర్యాలు కల్పించామని జెఈవో తెలిపారు. భక్తులకు భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. విఐపిలకు పరిమిత సంఖ్యలో దర్శన టికెట్లు కేటాయించామని, సామాన్య భక్తులు సౌకర్యవంతంగా శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టామని జెఈవో తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.