COMPLETE GOSHALA DEVELOPMENT WORKS BY DECEMBER END- TTD EO _ డిసెంబర్ చివరి నాటికి గోశాలలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

Tirupati, 22 November 2022:  TTD EO Sri A V Dharma Reddy directed officials to complete development works of feed mixing plant and ghee making unit at SV Gosamrakshala and installation of Second unit equipments by December end.

Addressing a review meeting at TTD Administrative Building on Tuesday evening,TTD EO instructed Goshala officials to strive and enhance the milk production capacity to 2500 litres per day.

Among others he asked officials to speed up Museum development work taken up with the co-operation of Tata group, shift the scrap lying in TTD local temples to DPW stores.

The TTD EO also reviewed the pending issues of legal department, Forest, Transport, DyEO (General), Estates, Vedic University, SVETA etc.

TTD JEO Smt Sada Bhargavi, Sri Veerabrahmam, SVBC CEO Sri Shanmukh Kumar, FA&CAO Sri Balaji, CE Sri Nageswara Rao, CAuO Sri Sesha Shailendra and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబర్ చివరి నాటికి గోశాలలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుపతి, 2022 నవంబరు 22: శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో నిర్మాణంలో ఉన్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, నెయ్యి తయారీ కేంద్రం, అగరబత్తుల తయారీ రెండవ యూనిట్ ను డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని టిటిడి ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో మంగళవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రాబోయే ఆరు నెలల్లో రోజుకు 2500 లీటర్ల పాల ఉత్పత్తి జరిగేలా కృషి చేయాలని గోశాల అధికారులకు సూచించారు. తిరుమలలో టాటా సంస్థ సహకారంతో జరుగుతున్న మ్యూజియం పనులను వేగవంతం చేయాలని, డిసెంబర్ మొదటి వారం నుంచి వీరి సేవలను వినియోగించుకోవాలని కోరారు. టిటిడి స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాల్లో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని డిపిడబ్ల్యు స్టోరుకు తరలించాలని సూచించారు.

అనంతరం న్యాయ విభాగం, అటవీ, రవాణ, డెప్యూటీ ఈఓ జనరల్, ఎస్టేట్, వేద వర్సిటీ, శ్వేత తదితర విభాగాల్లో సంబంధించిన పెండింగ్ అంశాలపై సమీక్షించారు.

ఈ సమీక్షలో జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఎసిఎఓ శ్రీ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, సీఏవో శ్రీ శేషశైలేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయ‌బ‌డిన‌ది.