COMPLETE RECITATION OF VALMIKI RAMAYANA IN DHARMAGIRI _ ధ‌ర్మ‌గిరిలో ఘ‌నంగా సంపూర్ణ వాల్మీకిరామాయ‌ణ పారాయ‌ణం

Tirumala, 22 January 2024: In honour of the prestigious program of Ayodhya Ramalaya, a recitation of the complete Valmiki Ramayana was held in a grand style at Dharmagiri Veda Vignana Peetham in Tirumala on Monday. 

The program was conducted between 9 am to 12.45 pm.  On this occasion, special pujas were performed to Sri Venkateswara Swamy, Sri Seetha Lakshmana Anjaneya Sametha Sri Rama in the Dharmagiri prayer hall.

On this occasion, the faculty and students recited more than 20 thousand shlokas from Balakanda, Ayodhyakanda, Aranyakanda, Kishkindakanda, Sundarakanda and Yudhakanda under the guidance of its  Principal Sri. KSS.Avadhani.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ధ‌ర్మ‌గిరిలో ఘ‌నంగా సంపూర్ణ వాల్మీకిరామాయ‌ణ పారాయ‌ణం

తిరుమల, 22 జ‌న‌వ‌రి, 2024: అయోధ్య రామాల‌య ప్రాణ‌ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మాన్ని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో సోమ‌వారం సంపూర్ణ వాల్మీకిరామాయ‌ణ పారాయ‌ణం ఘ‌నంగా జ‌రిగింది. ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12.45 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి, శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత రాముల‌వారికి, హ‌నుమంతుల వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా బాల‌కాండ‌, అయోధ్యాకాండ‌, అర‌ణ్య‌కాండ‌, కిష్కింధాకాంద‌, సుంద‌ర‌కాండ‌, యుద్ధ‌కాండలు క‌లిపి 20 వేల‌కు పైగా శ్లోకాల‌ను పారాయ‌ణం చేశారు. అదేవిధంగా యాగ‌శాల‌లో వేద విద్యార్థుల‌తో ఏడు వేదశాఖ‌ల సంపూర్ణ మూల‌పారాయ‌ణం చేప‌ట్టారు. వీటితోపాటు ఆనంద‌నిల‌యంలో ప్ర‌బంధ‌, ఆగ‌మ విద్యార్థుల‌తో శ్రీ సీతారామ మంత్రానుష్టానం, కార్యాల‌యంలోని హాలులో స్మార్త విద్యార్థుల‌తో శ్రీ ల‌క్ష్మ‌ణ‌, హ‌నుమ మంత్రానుష్టానం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని, అధ్యాప‌క బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.